సాధారణంగా ప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు . అందుకే ప్రేమ ముక్కు ముఖం చూసి కాదు మనసును చూసి పుడుతుంది అని అంటూ ఉంటారు. కొన్ని ప్రేమ బంధాలు  చూస్తే ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు తమ ప్రేమించిన వారిని కుటుంబం కోసం త్యాగం చేసిన వారు ఇటీవలి కాలంలో వృద్ధాప్యంలో మాత్రం ప్రేమించిన వారిని మరిచిపోలేక పెళ్లి చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో వృద్ధాప్యంలో పుట్టిన ప్రేమను సైతం గెలిపించుకోవడానికి ఎంతోమంది పిల్లలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతున్నాయ్. అయితే ఇలా ప్రేమికులు  విడిపోయి మళ్ళీ కలవడం లాంటివి చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా భార్యాభర్తలు దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.


 చివరికి వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు ఒక్కటయ్యారు. ఇటీవల కాలంలో ఒక్కసారి విడాకులతో భార్య భర్తలు విడిపోయిన తర్వాత ఎవరి దారి వారిది అన్నట్లుగానే బ్రతికేస్తున్నారు. కనీసం విడాకులు తీసుకోకుండా భర్త తో సంతోషంగా ఉన్నాము.. కొన్ని రోజులు గడిపాను అన్న విషయం కూడా మరిచిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. కానీ ఇక్కడ భార్య భర్తలు మాత్రం విడాకులు తీసుకున్న దాదాపు 52 ఏళ్ల తర్వాత కలిసి జీవించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఘటన కర్ణాటకలోని ద్వారాడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


 లోక్ అదాలత్ కార్యక్రమంలో వృద్ధ జంటను జడ్జీలు మళ్లీ కలిపారు. బసప్ప అనే 85 ఏళ్ల వృద్ధుడు కలవ అనే 80 ఏళ్ల వృద్ధురాలు పెళ్లయిన కొద్ది సంవత్సరాలకు దాదాపు యాభై రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇక బసప్ప భార్యకు భరణం చెల్లిస్తూ నే ఉన్నాడు. ఈ మధ్య కొద్ది నెలలుగా భరణం ఇవ్వడం ఆపేసాడు. దీంతో కలవ్వ కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం లోక్ అదాలత్  లో ఈ కేసును పరిష్కరించాలని అనుకుంది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కలిసి జీవించేందుకు ఒప్పించారు. ఇలా విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోవాలి  అనుకుంటున్నా 38 జంటలను జడ్జీలు కలపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: