ఇటీవలి కాలంలో పోలీసులు రేయింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజలకు రక్షణ కల్పించేందుకు కష్టపడుతూనే ఉన్నారు అన్న విషయానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఏకంగా అర్ధరాత్రి సమయంలో కూడా ఒక్క ఫోన్ కొడితే పోలీసులు నిమిషాల్లో వాలిపోతున్నారు అన్న మాటలకు నిదర్శనంగా ఇక్కడ మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల తర్వాత పోలీస్ కమిషనర్ ఫోన్ మోగింది. ఇక అర్ధరాత్రి కావడంతో ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుందని కమిషనర్ ఫోన్ ఎత్తారు. ఇంతలో అటు వైపు నుంచి బావిలో పిల్లి పడిపోయింది ప్రాణాలు కాపాడండి సార్ అంటూ ఒక వ్యక్తి పోలీసు కమిషనర్ను కోరారు.


 అయితే ఇలా అర్ధరాత్రి ఫోన్ చేసి పిల్లిని కాపాడండి అన్నప్పుడు ఎవరైనా సరే పోలీస్ కమిషనర్ చిరాకు పడతారేమో అని అనుకుంటారు. కానీ ఆయన మాత్రం ఎంతో బాధ్యతాయుతంగా  వ్యవహరించి పిల్లి ప్రాణాలు కాపాడటానికి అసిస్టెంట్ కమిషనర్ ను పురమాయించాడు. ఇక ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కలిసి బావిలో పడిన పిల్లలు కాపాడారు. ఈ ఘటన కరీంనగర్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. స్థానిక విద్యానగర్లోని కేడీసీసీ బ్యాంకు వద్ద నివాసముంటున్న మనోహర్ ఇంటి వెనకాల ఎవరు వినియోగించని బావి ఉంది. అయితే ఇంటి పరిసరాల్లో సంచరించే రెండు పిల్లులు పోట్లాడుకుని చివరికి ఒక పిల్ల బావిలో పడిపోయింది.


 ఈ విషయాన్ని గమనించిన మనోహర్ వెంటనే జంతు సంరక్షణ సిబ్బందిని ఆశ్రయించగా వారి సూచన తో మనోహరాబాద్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు అగ్నిమాపక సిబ్బంది కి ఫోన్ చేశారు. అయితే ఇక పోలీస్ కమిషనర్ సమస్యను పరిష్కరించేందుకు అసిస్టెంట్ కమిషనర్ ను పురమాయించాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఒక జాలి గంపను బావిలోకి వదిలి పిల్లి ప్రాణాలను రక్షించారు. ఇక ఈ ఘటన ద్వారా ఎవరికి ఏ కష్టంవచ్చిన మేమున్నాము అని ధైర్యం ఇస్తామని పోలీసులు చెప్పకనే చెప్పారు అని నేటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cat