ప్రస్తుతం మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో  మనిషి ఆలోచించే తీరులో కూడా ఎంతో పరిపక్వత వస్తుందని చెప్పాలి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి అన్న విషయంపై అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో కూడా ఎంతోమంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ఎంతో మంది యువత సూసైడ్ చేసుకుంటున్నారు.


 తమకు వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించుకోవడం ఎలా అని ఆలోచించడం కంటే బలవన్మరణానికి పాల్పడితే అన్ని సమస్యలు తీరిపోతాయని క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయాము అనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న వారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫలితాలను వెల్లడయ్యాయి. ఫలితాలలో పాసైన విద్యార్థులు ఎంత సంతోష పడిపోయారో ఫెయిల్ అయిన విద్యార్థులు అంతే బాధపడిపోయారు.


 ఈ క్రమంలోనే ఇంటర్ ఫలితాలు చివరికి ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు తీశాయి అనేది తెలుస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని 7 గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఒక హైదరాబాదులోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా సంగారెడ్డి జిల్లా నార్ల కుంట తండా లో గణేష్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ చింతల్ బస్తీ లో మార్కులు తక్కువగా వచ్చాయని మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.  అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయం తెలుస్తుంది. అయితే ఒక సారి పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసి పోయినట్లు కాదని.. మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు. కానీ జీవితం లో కఠిన నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ తిరిగి ప్రాణం రాదు అంటూ ఎంత మంది అవగాహన కల్పించిన ఇలాంటి ఆత్మహత్యలు తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: