ఒక్కగానొక్క కొడుకు.. ఆ తల్లిదండ్రుల ఆశలు అన్నీ కూడా అతని మీదే. తాము ఎంత కష్టపడినా పర్వాలేదు తమ కొడుకును మాత్రం ఎంతో పెద్ద చదువులు చదివించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కొడుకు బంగారు భవిష్యత్తు అందించాలనిఅనుకున్నారు. ఇక బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆశ పడ్డారు. కానీ విధి వారి పట్ల చిన్నచూపు చూసింది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో పదహారేళ్ల ప్రాయంలోనే అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని తల్లిదండ్రులకు దూరం చేసింది.


 చివరికి ఆ తల్లిదండ్రుల రోదన అందరిని కంటనీరు పెట్టించింది అని చెప్పాలి. అయితే ఇటీవలే పదవ తరగతి పరీక్షలు రాసిన అనంతరం సదరు విద్యార్థి మరణించడం గమనార్హం. ఇక ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణుడు అయ్యాడు సదరు విద్యార్థి. ఈ విషాదకర ఘటన జోగులాంబ గద్వాల జిల్లా లో వెలుగులోకి వచ్చింది. ఐజా మండలంలోని చిన్న తాండ్రపాడు కు చెందిన చంద్రకళ, ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం 20 ఏళ్ల కిందట పెబ్బేరు లో స్థిరపడ్డారు. వీరికి రాకేష్ అనే 16 ఏళ్ళ కొడుకు ఉన్నాడు.


 అయితే రాకేష్ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాల లో పదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు కూడా రాశాడు. అయితే అంతలోనే తండ్రి పక్షవాతానికి గురి కావడంతో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇక ఇటీవలే తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి బావిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. అయితే ఇటీవలే విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 8.8 gpa సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కొడుకు పాస్ అయిన విషయంతెలుసుకున్న తల్లిదండ్రులు మరింత కన్నీటిపర్యంతమయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: