ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు ఎన్నో దారుణ ఘటనలకు కారణమవుతున్నాయ్. వేదమంత్రాల సాక్షిగా  ఏడడుగులు నడిచి పెళ్లి చేసుకున్న వారితో ఎంతో సంతోషంగా ఉండాల్సిన వారు కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల  మోజులో పడి కుటుంబం పిల్లలు అన్న విషయాన్ని  కూడా మరిచిపోయి అక్రమ సంబంధం పెట్టుకున్న వారితోనే వెళ్ళిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. తద్వారా హత్యలు ఆత్మహత్యలు లాంటి ఘటనలు  కూడా జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.


 సాఫీగా సాగిపోతున్న సంసారంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది. ఇక భార్య ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో కోపంతో విచక్షణ కోల్పోయినా తండ్రికి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. చివరికి ఇంట్లో ఉన్న ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటక లోని కలబుగిరి లో వెలుగులోకి వచ్చింది. బోబి నగర్ కు చెందిన లక్ష్మీకాంత్, అంజలీ దంపతులకు నలుగురు సంతానం ఉన్నారు. లక్ష్మీకాంత్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఇక వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. వచ్చిన దాంట్లో ఆ కుటుంబం ఎంతో సంతోషంగానే ఉంది.


 కానీ అక్రమ సంబంధం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. అంజలికి వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడగా.. పరిచయం ప్రేమగా మారింది. ఇది కాస్తా ముదిరి చివరికి భర్త పిల్లలను కాదని అంజలీ అతనితో పారిపోయింది. ఇక ఇటీవల లక్ష్మీకాంత్ నలుగురు పిల్లలు అవ్వ దగ్గర ఉంచాడు. అయితే ఇటీవలే పిల్లలకు దుకాణంలో ఏదైనా కొనిస్తానని బయటకు తీసుకెళ్లి ఇతరిని ఆటోలో కూర్చోబెట్టి మరో ఇద్దరు కూతుర్లు గొంతు పిసికి చంపేశాడు. ఇద్దరు మృతదేహాలు ఆటలో వేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఇక ఈ ఘటన కాస్త ప్రతి ఒక్కరిని ఉలికిపాటుకు గురిచేసింది. లక్ష్మీకాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: