భర్త, అత్తమామలు పెట్టె చిత్ర హింసలు తట్టుకోలేక భార్యలు కోర్టులు చుట్టూ తిరగడం మనం చూసే ఉంటాము..కానీ భార్య ఎప్పుడైనా చిత్ర హింసలు పెట్టింది అని భర్త కోర్టుకు వెళ్ళడం చరిత్రలో ఇదే మొదటి కేసు అనుకోవచ్చు.. ఇప్పుడు ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.భర్త పెట్టే హింసలు భరించలేక విడాకుల కోసం కోర్టుకెక్కిన భార్యల గురించి విన్నాం. విడాకులు తీసుకుంటు భరణం కోసం డిమాండ్ చేసే సందర్భాల గురించి తెలిసిందే.కోర్టులు కూడా భరణం ఇప్పించే విషయంలో తీర్పులు బాధితుల తరపున ఇస్తుంటాయి. మహారాష్ట్రలోని పుణె ఫ్యామిలీ కోర్టు భిన్నమైన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది. పైగా 78 ఏళ్ల భార్య 83 ఏళ్ల భర్తకు నెలకు రూ.25వేలు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది. సదరు వృద్ధ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే.. భర్తకు భార్య నెల నెలా రూ.25 వేలు భరణంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.


పుణెకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడు తన 78 ఏళ్ల భార్య తనను వేధిస్తోందని..మనశ్శాంతి లేకుండా చేస్తోందని దయచేసిన ఆమెనుంచి తనకు విడాకులు ఇప్పించాలని పైళ్లి జరిగిన 55 ఏళ్లకు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విడాకులతో పాటు భరణం ఇప్పించాలని కోరుతూ 2019లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తమ వివాహమై 55 ఏళ్లు అయిందని..ఇన్నేళ్లుగా తాను భార్య వేధింపుల్ని భరిస్తునే ఉన్నానని ఇక ఈ వృద్ధాప్యంలో తను ఆవేధింపుల్ని భరించలేకపోతున్నానని దయచేసిన నాకు భరణంతో కూడిన విడాకులుఇప్పించాలని కోరాడు.


దీనిపై కోర్టు విచారణ జరిపిన ఫ్యామిలో కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఆ వృద్ధ జంటకువిడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'తప్పు ఎవరి వైపు ఉన్నా తప్పేనని.. సంపాదన, విడాకుల విషయంలో స్త్రీపురుష భేదం చూపించాల్సిన అవసరం లేదు' అని పేర్కొంది. ఇన్నాళ్లు భర్తను మానసిక క్షోభకు గురించిన భార్య ప్రతినెలా రూ.25 వేల చొప్పున భర్తకు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది..మొత్తానికి ఈ కేసు ఇప్పుడు వైరల్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: