సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు  రోడ్డు మీద పాము కనిపించింది అంటే చాలా ఒక్కసారిగా హడలి పోతుంటాము అన్న విషయం తెలిసిందే. కానీ పాము మన వైపే వస్తుంది తెలిస్తేతెలుసు. అక్కడ నుంచి పరుగో పరుగు అంతే. కానీ కొంతమంది మాత్రం  పాము కనిపిస్తే పరిగెత్తడం కాదు ఏకంగా పాములను పరిగెత్తిస్తూ ఉంటారు. పాముల్ని పడుతూ ఎంతోమంది ప్రాణాలను రక్షణ కల్పిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇలా పాములు పడుతూ ఎంతోమందికి ధైర్యాన్ని కల్పించిన వారు చివరికి అదే పాముకాటు బారిన పడి చని పోతారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎంతోమంది పాములు పట్టే వారి విషయంలో ఇది నిజం అయింది కూడా.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్లుగా పాములు పట్టడంలో అతనికి తిరుగులేదు అని చెప్పాలి. ఇప్పటివరకు వేల పాములను పట్టాడు. కాని చివరికి ప్రాణాలు వదిలాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వార్త కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇండోర్లోని భగత్ సింగ్ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అశోక్ మేవాడ అనే 57 ఏళ్ల వ్యక్తి  దాదాపు 40 ఏళ్ల నుంచి ఎంతో ప్రమాదకరమైన పాములు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. దీంతో ఇంట్లోకి పాము వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఫోన్ చేస్తూ ఉంటారు.


 ఇటీవల సుమన్ నగర్ లోని ఒక వ్యక్తి అశోక్ ఫోన్ చేసి తమ ఇంట్లో పాము ప్రవేశించింది అని చెప్పాడు. ఎప్పటిలాగానే అశోక్ అక్కడికి వెళ్లి పాముని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది కాటు వేసింది. అయినప్పటికీ పట్టువిడవకుండా అశోక్ పామును పట్టుకునీ  మరో చోట వదిలేశాడు. అయితే తన శరీరం నుంచి కొంత విషయాన్ని స్వయంగా తొలగించాడు. ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత పరిస్థితి విషమించింది.. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే విషం శరీరమంతా వ్యాపించడంతో పొందుతూ మృతి చెందాడు. ఇలా పాములు పట్టే వ్యక్తి అదే పాముకాటు చనిపోవడంతో అతనీ మృతి స్థానికంగా సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: