ఇటీవలికాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో చిన్న వయసులోనే పడుతున్న ప్రేమ చివరికి జీవితాలను ఛిద్రం చేస్తోంది. ఇక తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని తమ పిల్లలను చదివిస్తూ ఉంటే.. పిల్లలు మాత్రం ప్రేమ దోమ అంటూ కాలేజీలు ఎగ్గొట్టి తిరగడం.. చివరికి ప్రేమ విఫలమైంది అనే కారణంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం.. తమ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత  మిగల్చడం లాంటివి చేస్తున్నారు. ప్రేమ పేరుతో మోసాలు పాల్పడుతున్న వారు నేటి రోజుల్లో కొంతమంది అయితే.. ప్రియురాలు దూరం అయింది అన్న కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు మరికొంతమంది.


 ఇక ప్రేమించి పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత పరువు హత్యలు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు మరికొంత మంది. ఇలా ప్రేమ అంటే మధుర జ్ఞాపకాలు ఎన్నో తీయని గుర్తు లకు కేరాఫ్ అడ్రస్ అన్న విధంగా కాకుండా ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్గా మారిపోయింది నేటి రోజుల్లో. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ప్రేమ అనే కారణంతో  ప్రాణాలు పోతూనే ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది. ప్రేమ విఫలం అయింది అన్న కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.



 ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లా సిర్గాపూర్ మండలం చిన్న ముబారక్ పూర్ లో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఫకీర్ అహ్మద్ అనే పదిహేడేళ్ల బాలుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. సదరు యువతి కూడా అతని ప్రేమను అంగీకరించడం తో ఎన్నో రోజుల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు.  అయితే ఇటీవలే ఫకీర్ ఆహ్మద్ ప్రేమించిన యువతిని వేరొకరితో పెళ్లి నిశ్చయమైనది తెలుస్తుంది. దీంతో ప్రేమ విఫలంఅయింది అన్న విషయాన్ని తట్టుకోలేకపోయాడు. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: