రెండు కొప్పులు ఒక చోట ఉంటే గొడవలు జరుగుతాయని అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆడవాళ్ళు అలా తయారు అయ్యారు..కొడుకులు కనడం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. సోదరుడి ఐదుగురు కూతుళ్లలో ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాడు.. ఆ బాలికను 10వ తరగతి వరకు చదివించాడు.. 2017లో ఘనంగా వివాహం చేశాడు..పెళ్లికి దాదాపు 18 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.. అయితే అత్తంటికి వెళ్లిన కూతురు ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.. వారి వేధింపులు భరించలేక చివరకు విషం తాగేసి ఆత్మహత్య చేసుకుంది.. వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.


వివరాల్లొకి వెళితే..రాజస్థాన్‌లోని అళ్వార్‌లోని మంగళ్వా గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి తన సోదరుడి కుమార్తెలలో ఒకరైన మనీషాను దత్తత తీసుకున్నాడు. ఆమెను పదో తరగతి వరకు చదివించి 2017లో పెళ్లి చేశాడు. పెళ్లి ఘనంగా చేయడమే కాకుండా కట్నం కూడా భారీగా ఇచ్చాడు. అయితే అత్తింటికి వెళ్లిన మనీషా అదనపు కట్నం కోసం వేధింపులు ఎదుర్కొంది. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత కూడా మనీషా పరిస్థితి మారలేదు. చిన్న విషయానికి కూడా మనీషాను ఆమె అత్త కృపా దేవి తీవ్రంగా అవమానించేది. కృపా దేవి గత శుక్రవారం ఒక గుడికి వెళ్లి తాయెత్తులు తీసుకువచ్చింది. మనవరాళ్లు ఇద్దరికీ ఆ తాయెత్తులు కట్టమని మనీషాకు చెప్పింది.


కానీ, మనీషా కట్టకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం మనీషా విషం తాగేసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అయితే మనీషా తలపై గాయాలున్నట్టు పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. దీంతో పోలీసులు మనీషా భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు..అదనపు కట్నం కోసమే వేధింపులకు గురి చేస్తున్నారు.పోలీసులు మనీషా భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదనపు కట్నం కోసం మనీషాను అత్తింటి వారు ఎప్పట్నుంచో వేధిస్తున్నారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..ఈ విషయం పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: