ఈ మధ్య కాలంలో యువత ప్రేమ పేరుతో శారీరక సుఖాల ను తీర్చుకుంటూన్నారు. చివరికి మొహం ఛాటేస్తున్నారు. కొందరేమో నీకు నాకు సెట్ అవ్వదు అని బ్రేకప్ చెప్పి ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకున్నారు.. ఇలాంటి ఘటనలు ఈరోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రియురాలికి చుక్కలు చూపించాలి అంటూ ఏవేవో చేస్తున్నారు. తన సత్తా ఏంటో చూపించాలి అనుకుంటున్నారు. చివరికి ప్లాన్ రివర్స్ కావడం తో చనిపొథున్నారు. ఇలాంటి పురుషులు ఎక్కువగా వయగ్రా మాత్రలను వాడుతూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది. ప్రేయసి తో కలిసి లాడ్జికి వెళ్లిన ఓ యువకుడు.. కాసేపటికి స్పృహ కోల్పోయాడు. ఎంతసేపటికీ అతడు లేవకపోయేసరికి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సదరు యువకుడిని డాక్టర్లు పరీక్షించగా.. అప్పటికే అతడు చనిపొయాడని నిర్దారించారు.అసలేం జరిగింది అని అతని ప్రియురాలు కంగారుపడి నానా రచ్చ చేసిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది.
అసలు విషయాన్నికొస్తే.. ఈ ఘటన మహారాష్ట్ర లో వెలుగు చూసింది. అజయ్ అనే 25 ఏళ్ల యువకు డు తన ప్రేయసితో కలిసి ఆదివారం సాయంత్రం సావనేర్‌ లో ఉన్న ఓ లాడ్జికి వెళ్లాడు.



కొద్దిసేపు అంతా బాగానే ఉంది. అయితే హఠాత్తు గా అజయ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఎంతసేపటికి లేవకపోయేసరికి భయపడిన అతడి ప్రియురాలు.. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బందికి.. ఫోన్ ద్వారా అతడి స్నేహితుడికి తెలియజేసింది. వారంతా హుటాహుటిన అజయ్‌ని ఆసుపత్రి కి తరలించగా.. వైద్యులు పరీక్షించి.. అప్పటికే అజయ్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు మృతుడి జేబులో శృంగార సామర్ధ్యాన్ని పెంచే మాత్రలు పోలీసులకు లభ్యమయ్యాయి. ఇది హత్యా.? లేక ఇంకేదైనా ఉందా.? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: