ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యక్రమాలు సాగుతున్నట్లు వెలుగులోకి రావడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.ఈ క్రమంలోనే ఏకంగా ఉగ్రవాద కదలికలపై అటు కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు  ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు అని తెలుస్తుంది. Simi పై నిషేధం విధించడంతో ప్రస్తుతం పీఎఫ్ఐ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిజాంబాద్ కమిషనర్  నాగరాజు చెప్పుకొచ్చారు.


 అయితే పీఎఫ్ఐ  పేరుతో ఏకంగా 200 మందికి శిక్షణ పొందినట్లు పోలీసులు కూడా గుర్తించారు. నిజాంబాద్ లో మాత్రమే కాదు జగిత్యాల కడప నెల్లూరు కర్నూలు హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వారు ఇందులో శిక్షణ పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది అని చెప్పాలి. ఇటీవల జగిత్యాల వాసి అయిన అబ్దుల్ ఖాదర్ ఈనెల 4వ తేదీన అరెస్టు చేశారు. అయితే ఖాదర్ స్వస్థలం జగిత్యాల అయినప్పటికీ కొద్ది రోజులు దుబాయ్ లో పని చేసి ఇక్కడికి వచ్చాడు. జగిత్యాల వచ్చినప్పటి నుంచి ఇక పీఎఫ్ఐ  లో చురుగ్గా పాల్గొంటున్నట్లు  పోలీసు విచారణలో తేలింది. అయితే కరాటే క్లాస్ లు అనే ముసుగులో వరంగల్ వెళ్లి కూడా ట్రైనింగ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.


 మతోన్మాద భావాలు ఉండే యువకులు ని సెలెక్ట్ చేసుకొని ఇక వారికి ఏకంగా ఆర్థిక సహాయం చేసి మరీ రెచ్చగొట్టే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవలే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి  వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఖాదర్ ఇచ్చిన సమాచారం మేరకు నిజాంబాద్ కు చెందిన  చెందిన మహ్మద్ అబ్దుల్ తోపాటు గుండారం గ్రామానికి చెందిన మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా ఇలా నిజాంబాద్లో కరాటే క్లాస్ ల ముసుగులో పీఎఫ్ఐ శిక్షణ ఇవ్వడం మాత్రం సంచలనంగా  మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: