ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం అటు దళితులందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా దళిత బందు అనే పథకాన్ని తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక దళిత బంధు పథకం కింద పదిలక్షల రూపాయలు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి వ్యవసాయ పనుల కోసం ఉపయోగపడేలా ట్రాక్టర్లను కొనిచ్చింది. ఈ క్రమంలోనే ఎంతోమంది దళిత బందు ద్వారా లబ్ధి  పొందుతున్నారు అని చెప్పాలి. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది అర్హులైన వారికి ప్రభుత్వం దళిత బందు కింద ట్రాక్టర్లను కొనిచ్చింది అని చెప్పాలి.


 అయితే దళిత బంధు ద్వారా వచ్చిన ట్రాక్టర్  ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణం తీసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా తనకు ట్రాక్టర్ రావడంతో సదరు వ్యక్తి ఎంతో ఆనంద పడిపోయాడు. నా జీవితం మారబోతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇలా దళిత బంధు పథకం ద్వారా వచ్చిన ట్రాక్టర్ వల్ల తన ప్రాణం పోతుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. వ్యవసాయ పొలం దున్నుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. దీంతో డ్రైవర్ మృతి చెందగా అతని కుటుంబం మొత్తం అరణ్యరోదనగా విలపించింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో వెలుగులోకి వచ్చింది.



 మానకొండూరు మండల కేంద్రంలోని బంజరు పల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తి ఇటీవల దళిత బంధు పథకం కింద ట్రాక్టర్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తన జీవితం మారిపోతుందని పిల్లలను బాగా చదివించవచ్చు అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇలా ఉపాధి కల్పిస్తుంది అన్న ట్రాక్టర్ ఉసురు తీసుకుంటుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. వ్యవసాయ భూమి లో పొలం దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. దీంతో  శంకర్  మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో శంకర్ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: