ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన రోజు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే తన పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకునేందుకు అందరూ ఇష్టపడుతున్నారు నేటి రోజుల్లో. అయితే పెళ్లి విషయంలో ఇటీవల కాలంలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం.. బాగా మేకప్ వేసి నల్లగా ఉన్నవారిని తెల్లగా చూపించి.. అలాగే ఫోటోలు తీసి ఇక పెళ్లి చూపుల కోసం వాటిని పంపించడం లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది బట్టతల ఉన్న వారు కూడా విగ్గు పెట్టుకుని యువతి కుటుంబ సభ్యులను నమ్మించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇలాంటివి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతాయి అన్నది కొన్ని ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఇక పెళ్లి చూపుల కోసం ఫోటో పంపించాలి అంటే ఒక ఫోటోకి ఫోటో షాప్ లో ఎడిట్ చేసి ఎంతో అందంగా మార్చి పంపించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ నేరుగా వెళ్లి చూసిన తర్వాత ఫోటోలో ఉన్నది కళ్ళ ముందు ఉన్న ఓ వ్యక్తి ఒక్కరేనా అని ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తల్లిదండ్రులు వచ్చి  ఒక అబ్బాయి ఫోటో పెట్టగానే ఆ అబ్బాయిని చూసి ఎంత అందంగా ఉన్నాడో అంటూ మురిసి పోయింది యువతి.


 కానీ తీరా పెళ్లి సమయానికి అతను ఫోటోలో కంటే నల్లగా ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ అందరికీ షాక్ ఇచ్చింది సదరు యువతి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఏటావా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సరిగ్గా పెళ్లి సమయానికి తన పక్కన ఉన్నది ఫోటోలో చూపించిన వాడు కాదని వధువు సహా ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో వరుడికి ఇచ్చిన నగలు గిఫ్టులు అన్ని తిరిగి ఇచ్చేయాలని పోలీసులను ఆశ్రయించారు వధువు కుటుంబ సభ్యులు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: