రేపు ఉంటుందో లేదో అనే గ్యారెంటీ లేని జీవితం లో ప్రతి మనిషి కూడా రేపు బాగుంటుందని ఆశతో బ్రతికేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే   ఇక ప్రతి ఒకరి జీవితం కూడా ఇదే ఆశతో సాగిపోతూ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో కాలంలో విధి మనుషుల జీవితాలతో ఆడుకుంటోంది అనుకునే విధంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని  ఘటనలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.

 ఇప్పటికే అధునాతన జీవనశైలిలోకి మారిపోయిన మనిషి అలవాట్ల కారణంగా చివరికి ఎంతోమంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఈ సమస్యల కారణంగా ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతకమైన మహమ్మారి ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతుంది. ఇక మరోవైపు రోడ్డు ప్రమాదాలు రూపంలో  ఎంతో మంది మనుషులు చేజేతులారా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. వెరసి నేటి రోజుల్లో అయితే మనిషి ప్రాణాలకు కాస్తయినా గ్యారెంటీ  లేకుండా పోయింది అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా కొంతమంది సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరు స్నానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే అంత్యక్రియల కోసం నీళ్ళ టాంకర్ తీసుకు వెళ్తున్న ఒక వ్యక్తి చివరకు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టయా  పల్లి లో వెలుగులోకి వచ్చింది. గడ్డపోతారం పంచాయతీ పరిధిలోని సదరు గ్రామంలో మాదారం కృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇక అతని అంత్యక్రియల కోసం ట్రాక్టర్ పై అంత్యక్రియలు ముగిసిన తర్వాత బంధువులు కుటుంబీకులు స్నానం చేసేందుకు నీళ్లు తీసుకువెళ్తున్నాడు ఎరుకల మల్లేష్. అయితే ఇక ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో చివరికి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: