ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే  విద్యార్థులందరికీ కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఎంతో పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందజేస్తున్నాము అంటూ అటు ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాయి. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేయడం ద్వారా అటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా చదువులో మరింత చురుగ్గా ఉండే అవకాశం ఉంది అంటూ అటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెబుతూ ఉంటారు. కానీ ప్రభుత్వాలు చెబుతున్నదానికి వాస్తవంగా ఉన్న దానికి మాత్రం ఎంతో వ్యత్యాసం ఉంది అన్న దానికి నిదర్శనం ఇటీవల కాలంలో ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 ఇటీవల కాలంలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఎంతో మంది పిల్లలు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాలలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు అటు తల్లిదండ్రులలో ఆందోళనకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న  ఆహారానికి బదులు ఇక ఇంటి నుంచి విద్యార్థులు తమ వెంట టిఫిన్ బాక్సులు తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించిన ఆహారం ఏకంగా ఒక విద్యార్థుల పాలిట శాపంగా మారింది.



 మధ్యాహ్న భోజనం తిని ఓ విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా గురజాలలో వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామని.. పోషకాలతో  కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వంపై ఇక ఈ ఘటనతో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: