రేపు బాగుంటుంది అని ఒక చిన్న ఆశ తప్ప.. మనిషి జీవితానికి అసలు గ్యారంటీ లేదు అన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన నిజం అన్న విషయం తెలిసిందే. అందుకే మనిషి  ఎప్పుడు ప్రాణాలు కోల్పోతాడు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఎన్నో ఊహించని ఘటన లు చివరికి ప్రాణాలు తీస్తూ కుటుంబంలో విషాదం నింపుతూ ఉంటాయి. సంతోషంగా సాగిపోతున్న కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒక రూపంలో మృత్యువు ఆ కుటుంబంలో అరణ్యరోదన మిగల్చడం చేస్తూ ఉంటుంది.


 ఇలా ఇప్పటివరకు ఎన్నో హృదయ విదారక ఘటన లు సోషల్ మీడియాలో తెర మీదికి వచ్చి ఎంతో మంది హృదయాలను కదిలించాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నదమ్ములు అంటే భూముల కోసం బద్ద శత్రువులు గా మారిపోయి పోట్లాడుకుంటూ ఉన్న నేటి రోజుల్లో ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం కలిసిమెలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఇలా అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండడం చూసి విధి కన్ను కుట్టినట్లయింది. కరెంట్ షాక్ రూపంలో ఇద్దరినీ ఒకే రోజు కానరాని లోకాలకు తీసుకు వెళ్ళింది విధి. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా కనేకల్ మండలం లో వెలుగులోకి వచ్చింది.



 నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్ళినా రమేష్,దేవేంద్ర అనే ఇద్దరు సోదరులు కూడా విద్యుదాఘాతంతో మృతి చెందారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వల్లప్ప పెద్ద భార్య కుమారుడు దేవేంద్ర చిన్న భార్య కుమారుడు రమేష్, వన్నూరు స్వామి అనే వ్యక్తి ముగ్గురు కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇటీవలే పొలానికి వెళ్లి పంపుసెట్ల ద్వారా నారుమడికి నీరు పెట్టాలని భావించారు. కాగా మోటార్ కు అమర్చిన పైపు వదులుగా ఉండటం తో గట్టిగా అదిమిపట్టి పట్టుకున్నాడు రమేష్. దేవేంద్ర మోటార్ స్టార్ట్ చేశాడు. రమేష్ విద్యుదాఘాతానికి గురికావడంతో పక్కనే ఉన్న దేవేంద్ర అతన్ని పట్టులున్నాడు. దీంతో ఇద్దరు మోటార్ పై కరెంట్ షాక్ తో పడిపోయారు. ఆ తర్వాత వారిని కాపాడేందుకు ప్రయత్నించిన వన్నూరు స్వామికి కూడా కరెంట్ షాక్  కొట్టింది. అతను గాయాలతో బయటపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: