సాధారణంగా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. అందుకే వెనక ముందు అన్ని చూసుకున్న తర్వాత ఇక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఒక వ్యక్తికి పెళ్లి అనేది కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఏకంగా మాయమాటలతో నమ్మించడం యువతులను పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత వారిని వదిలేసి ముఖం చాటేయడం లాంటివి చేస్తూ ఉన్నాడు. ఇలా ఎంతో మంది యువతులను మోసం చేస్తున్న నిత్య పెళ్లి కొడుకు ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఈ క్రమంలోనే సదరు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే మహిళా సంఘాల నేతలు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడం గమనార్హం. ఈ ఘటన సంగారెడ్డిలోని రామచంద్రపురంలో వెలుగులోకి వచ్చింది.


 గుంటూరు జిల్లా వేట పురం గ్రామానికి చెందిన శివ శంకర్ బాబు ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే గత ఏడాదిగా అదే కంపెనీలో పనిచేస్తున్న యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. యువతి తల్లిదండ్రులు అంగీకారంతో   డిసెంబర్లో ఆమెను వివాహం చేసుకున్నాడు శివ శంకర్. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే ఆమె బంగారం నగదు తీసుకుని వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత అతని తీరుపై అనుమానం వచ్చినా యువతి కుటుంబ సభ్యులు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.


 గతంలోనే పలువురు యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు  తేలింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు బాధితులు.  అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆడ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న శివ శంకర్ బాబు ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు 12 మంది యువతులను వివాహం చేసుకున్నట్లు తేలింది. ఇక ఈ నిత్య పెళ్ళికొడుకు వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: