ఇటీవలి కాలంలో ప్రేమ బంధం అనేది దారుణమైన ఘటనలకు చిరునామాగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రేమ రిజెక్ట్ చేసింది అన్న కారణంతో ప్రేమోన్మాదులు రెచ్చిపోతూ దారణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు  దూరం పెడుతుంది అన్న కారణంతో కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలిని సైతం హతమార్చేందుకు వెనకాడటం లేదు. మరికొన్ని చోట్ల ప్రేమ విఫలం అయింది అన్న కారణంతో ఎంతోమంది చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.


 ఇలా ఎక్కడ చూసినా ప్రేమ అనేది ప్రాణాలు ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మాజీ ప్రియురాలిపై కక్ష పెంచుకున్న ఓ యువకుడు చివరికి ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. తల నరికి అనంతరం ఆమె తలను ఒక చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో జరిగిన విషయం చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయాడు సదరు యువకుడు. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కుడ్లిగి ప్రాంతానికి చెందిన భోజరాజు అనే 25 ఏళ్ల యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు.


 కాగా నర్సింగ్ చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థినిని ప్రేమించాడు. కానీ ఇటీవలే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ నిర్మల తో సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. అయితే ఇటీవలే నిర్మల భోజరాజుని దూరం పెడుతూ వచ్చింది. దీంతో మరో వ్యక్తిని ప్రేమిస్తు తనను మోసం చేస్తోందని అనుమానించాడు. నేరుగా యువతి ఇంటికి వెళ్లి యువతి ఒంటరిగా ఉండడంతో కత్తితో దాడి చేసి తల నరికేశాడు. తర్వాత ఆమె తలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు  వెళ్లి లొంగిపోయాడు. ఇక అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: