ఎర్రచందనం స్మగ్లింగ్ ఈ పేరు చెబితే చాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు గంధపు చెక్కల స్మగ్ లింగ్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ పుష్ప సినిమా మాత్రం ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసింది. అయితే పుష్ప సినిమా తర్వాత ఇక అటు స్మగ్లింగ్ కూడా బాగానే పెరిగిపోయిందని చెప్పాలి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోలీసుల కళ్ళుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టుగానే అక్రమార్కులు కొత్త కొత్త దారులు వెదుకుతు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికిప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.


 ఇక పోలీసులు కూడా పుష్ప సినిమా చూసే ఉంటారు కదా. ఈ క్రమంలోనే ఎంతో తెలివిగా అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ప్రపంచంలోనే మంచి క్వాలిటీ ఉన్న ఎర్రచందనం రాయలసీమలోని శేషాచలం అడవుల్లో ఉంటుంది. ఇక ఈ ఎర్ర చందనానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ డిమాండ్ని క్యాష్ చేసుకుని ఎలాగైనా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి భారీగా డబ్బులు సంపాదించాలని ఎంతో మంది అక్రమార్కులు ఇప్పటినుంచి కాదు కొన్ని దశాబ్దాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి.


 ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు పెరుగుతున్న నేపథ్యంలో మరింత వినూత్నమైన ప్లాన్ లతో గంధపు చెక్కల స్మగ్లర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని చంద్రగిరిలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కారులో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులు తనిఖీ చేసిన సమయంలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అయితే పోలీసులను చూడగానే డ్రైవర్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఏంటో అని కారులో చెక్ చేయగా.. 105 కిలోల బరువున్న 3.5 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దొరికింది. స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: