ఈ మధ్య పెద్ద నగరాల్లో వ్యభిచారం ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం కరోనా తర్వాత నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ అయ్యాయి. చాలా మంది మహిళలు ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డారు.. పొట్ట కూటి కోసం ఇక చేసేది లేక వ్యభిచారం లోకి దిగారు..పోలీసుల కళ్ళు కప్పె ప్రయత్నం చేస్తూ అక్కడక్కడా ఎక్కువ జరుగుతున్నాయి.తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది..స్పా, మసాజ్‌ సెంటర్ల మాటున వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇటీవల దేశంలోని మెట్రోపాలిట నగరాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో బయట పడ్డాయి. తాజాగా వీటి చాటున సాగిస్తున్న వ్యభిచారం దందా రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు..


దయానంద్‌ విహార్‌లో జరుగుతున్న ఈ దందాపై పోలీసులు దాడులు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వెనెజ్‌ థాయ్‌ స్పా పేరుతో దయానంద్‌ విహార్‌లో సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన బయలుదేరి దాడులు నిర్వహించారు. కస్టమర్ల పేరుతో స్పాను సందర్శించిన పోలీసులు.. వ్యభిచార ముఠాను గుట్టురట్టు చేశారు. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. స్పా లైసెన్స్‌ కూడా గడువు ముగిసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. స్పా సెంటర్‌ను సీజ్‌ చేసేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముర్మరం చేశారు. అయితే ఇటీవల కూడా ఢిల్లీలో మసాజ్‌ సెంటర్ల ముసుగులో కొన్ని వ్యభిచార దందాల కేసులు వెలుగు చూశాయి..


గతంలో ఎన్నోసార్లు జరిగాయి.పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నా కూడా మళ్ళీ జరుగుతునే ఉన్నాయి..మార్చి 25న రిషబ్‌ విహార్‌, పంకజ్‌ ప్లాజాలోని అవేదం స్పాలో పోలీసులు జరిపిన దాడుల్లో సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న రెండు ముఠాలను గుట్టు రట్టు చేశారు. మార్చి 20న ఢిల్లీలో గ్రీన్‌ పార్క్‌లోని వెల్‌నెస్‌ స్పా సెంటర్‌లో కూడా సెక్స్‌ రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ దాడులకు ముందు యంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌, ఢిల్లీ పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు తాము కస్టమర్లుగా నటిస్తూ ఈ దందాను బట్టబయలు చేశారు. ఇందులో స్పా, ఆయుర్వేద థెరఫీ సెంటర్‌ పేరుతో అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో స్పా యజమాని రాకేష్‌ కుమార్‌ గుప్తాతో పాటు మొత్తం 11 మంది మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. ఇలా ఢిల్లీలో స్పా సెంటర్ల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న వ్యభిచారాన్ని దందాలను పోలీసులు బయట్టబయలు చేస్తున్నారు..కేసులు నమోదు అయిన కూడా వారి తీరు మాత్రం మార్చుకోలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: