ప్రేమించిన ప్రతి ఒక్కరూ పెళ్ళి చేసుకోవాలని లేదు..పెళ్ళి చేసుకున్న వాళ్ళు అన్యొన్యంగా ఉండాలని లేదు..చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ వస్తున్నారు.అవే ఇద్దరూ విడి పోయే వరకూ తీసుకెల్తాయి.ఇప్పుడు కూడా అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది.. ఓ వ్యక్తికి తన భార్యకు రోజూ గొడవలు పడుతూ చివరికి విడిపొవాలి అనుకుంటారు. అయితే భర్త స్నేహితుడు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు..అప్పుడే దారుణం జరిగి పోతుంది..
ఈ ఘటన భొఫాల్ లో వెలుగు చూసింది.ఒక వ్యక్తి భార్యను, భర్త స్నేహితుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా అతడు తన స్నేహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.


భార్యకు విడాకులు ఇచ్చి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ దారుణం జరిగింది. భోపాల్‌కు చెందిన 28 ఏళ్ల హిందూ మహిళకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం ఆమె ముస్లిం మతంలోకి మారింది.పెళ్లైన కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త స్నేహితుడు హసీబ్ సిద్ధిఖీ, ఆ దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్‌ 28న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.


కాగా, ఆ మహిళ జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పింది. అయితే అతడు తన స్నేహితుడిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. భార్యపై అత్యాచారం చేసిన సిద్ధిఖీపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పైగా భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు ఇండోర్‌కు వెళ్లింది. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన ఇండోర్‌ పోలీసులు ఆ కేసును భోపాల్‌లోని గౌతమ్ నగర్ ప్రాంతం పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన సిద్ధిఖీతోపాటు మహిళ భర్తను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: