ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది తప్ప ఎక్కడా కనబడడం లేదు అన్న విషయం తెలిసిందే. రోడ్డు నిబంధనలు పాటించాలని ప్రాణాలను రక్షించుకోవాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా అటు ఎవరు మాత్రం వినిపించుకోవడం లేదు. వెరసి రోజురోజుకు ఇక రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఇక మరికొన్ని చోట్ల ఎంతో మంది నిర్లక్ష్యం అయిన డ్రైవింగ్ కారణంగా అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది అని చెప్పాలి.


 ఇటీవలే ఉత్తరప్రదేశ్లో ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొట్టడంతో ఇక ఈ దారుణం జరిగిపోయింది. ఇక ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు అన్నది తెలుస్తుంది. అయితే సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను  వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇలా గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది అన్న విషయాన్ని అధికారులు చెప్పుకొచ్చారు.



 లక్నో లోని కురుమ సెంటర్ కు తరలించినట్లు తెలిపారు. అయితే ఇలా ప్రమాదానికి గురైన రెండు డబుల్ డెక్కర్ బస్సులు కూడా బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. సరిగా లక్నో కి 30 కిలోమీటర్ల దూరంలో బారాబంకి జిల్లా లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది అని చెప్పాలి. ఒకవైపు ట్రాఫిక్ క్లియర్ చేస్తూనే మరోవైపు ఇక క్షతగాత్రులను అందరికీ సహాయక చర్యలు చేపడుతున్నారు పోలీసులు. 8 మంది మృతి చెందిన నేపథ్యంలో అటు సంఘటనా స్థలంలో మృతుల కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: