అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులందరూ ఎంతలా రోధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొన్నిసార్లు ఊహించని విధంగా ప్రాణాలు పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ప్రాణాలు పోయిన సమయంలోనే ఇప్పటికి కూడా కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు. చనిపోయిన వ్యక్తుల మళ్లీ బ్రతికి వస్తారని గట్టిగా నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది.



 ఆ తల్లిదండ్రులు కొడుకే ప్రాణంగా బ్రతికారు. కానీ విధి వారి విషయంలో చిన్నచూపు చూసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును పాముకాటు రూపంలో మృత్యువు కబళించింది. కొడుకు మరణవార్త విన్న ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కానీ పూజలు చేస్తే తమ కొడుకు బయటికి వస్తాడు అనే ఒక చిన్న నమ్మకం మాత్రం వారి మనసులో ఉంది. ఇలాంటి సమయంలోనే కొడుకు మృతదేహాన్ని దగ్గర పెట్టుకొని ఏకంగా 30 గంటల పాటు పూజలు చేశారు. ఇక తమ కొడుకు మళ్ళీ లేచి వస్తాడు అని ఎంతో ఆశగా ఎదురు చూసారు. కానీ వారి నమ్మకం వమ్ము అయింది  . తాము నమ్మింది ఒక మూఢ నమ్మకం అన్న విషయం అర్థమైంది. చనిపోయిన కొడుకు తిరిగి రాలేదు.


 దీంతో చివరికి చేసేదేమీ లేక కొడుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. మెయిన్ పురి జిల్లా జాతవాన్ మొహాల్ల గ్రామానికి చెందిన యువకుడిని  పాము కాటేసింది. ఈ క్రమంలోనే వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం తమ కొడుకు బ్రతికి వస్తాడు అనే నమ్మకంతోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా బ్రతికించు కోవాలని ఉద్దేశంతో తాంత్రికులను పాములు పట్టే వాళ్ళని తీసుకువచ్చారు. డబ్బులు ఖర్చయినా పర్వాలేదు కొడుకును బతికించుకోవాలి అని భావించి 30 గంటలు పూజలు చేశారు. ఇక ఎంతలా పూజలు చేసిన అతను మాత్రం బతకలేదు. దీంతో బాధాతప్త హృదయాలతో అతనికి అంత్యక్రియలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: