ప్రతి ఆడపిల్ల కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా భావిస్తూ ఇక దాంపత్య జీవితాన్ని ఎంతో సుఖంగా గడపాలని భావిస్తూ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో ఆడపిల్లలకి మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత వేధింపులు తప్పడం లేదు అన్నది మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే పెళ్లయిన కొన్నాళ్లకే అత్తింటివారు అసలు స్వరూపం చూపిస్తూ అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెడుతున్నారు. దీంతో ఇక కొత్త జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న యువతికి పున్నామ నరకం కనిపిస్తుంది.


 కొన్నిచోట్ల వరకట్న వేధింపులు చేస్తూ ఉంటే మరికొన్ని చోట్ల మానసికంగా వేధిస్తూ  చీటికిమాటికి దారుణంగా తిడుతూ ఉండడంతో మెట్టినింట్లో అడుగుపెట్టిన అమ్మాయిలకు కనీస ప్రశాంతత లేకుండా పోతుంది అని చెప్పాలి. వెరసి ఎంతోమంది అమ్మాయిలు ధైర్యం తెచ్చుకుని గృహ హింస తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్నాయ్. అయితే భారీగా గృహహింస ఫిర్యాదులు పెరిగి పోతున్నాయి అనడానికి నిదర్శనంగా ఇటీవలే ఒక నివేదిక బయటకు వచ్చింది సంచలనంగా  మారిపోయింది.


 వరకట్న వేధింపులు ఇతర కారణాలతో వేధింపులకు గురవుతున్న వారి నుండి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయనే విషయం తెలుస్తుంది. అయితే మహిళలు గృహ హింస ఫిర్యాదు చేసేందుకు 2013 లో కేంద్ర ప్రభుత్వం 181 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకు వచ్చింది. ఇక ప్రతిరోజూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి భారీ మొత్తంలోనే ఫిర్యాదులు అందుతున్నాయట. అయితే ఈ ఏడాది మార్చి 31 వరకు మొత్తంగా 70,17,925 ఫిర్యాదులు వచ్చినట్లు ఇటీవలే అధికారులు గుర్తించారు. అయితే వీటిలో దేశ రాజధాని ఢిల్లీలోని ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయట. 11,21, 711 ఫిర్యాదులు ఢిల్లీ నుంచి అందాయట. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 9 లక్షల 39 వేల 916, తెలంగాణ నుంచి 89,843  ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: