విద్యుత్ వైర్లు తగిల కుండానే ఇటీవలి కాలంలో ఎంతో మందికి షాక్ తగులుతుంది అన్న విషయం తెలిసిందే. ఎలా అంటే కరెంటు బిల్లులు చూసిన తర్వాత ఇటీవలి కాలంలో ఎంతోమంది విద్యుత్ అధికారులు వాడుకున్న దానికంటే ఎక్కువగా కరెంటు చార్జీలు వేస్తున్న నేపథ్యంలో ఎంతోమంది బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా వచ్చే బిల్లు తోనే ప్రతి ఒక్క సామాన్యుడు బెంబేలెత్తిపోతా ఉంటే కొన్ని కొన్ని సార్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఊహించని రీతిలో కరెంటు బిల్లు వస్తుండటం అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది.


 ప్రతి నెలా కనీసం వెయ్యి రూపాయలు కూడా కరెంటు బిల్లు రాని వారికి కొన్ని కొన్ని సార్లు లక్షల్లో రావడం జరుగుతూ ఉంటుంది.  ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు ఎన్నో సార్లు తెరమీదకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వచ్చిన కరెంటు బిల్లు చూసి ఒక వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. ఇంతకీ కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలుసా.. 3419 కోట్లు. ఇక ఈ కరెంటు బిల్లు గురించి విన్న తర్వాత మీరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు కదా. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్ లోని శివ విహార్ కాలనీకి చెందిన ప్రియాంక గుప్త ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా 3419 కోట్ల రూపాయలు వచ్చింది.


 ఇక ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ మామయ్య ఏకంగా మూర్చపోయి ఆసుపత్రిలో చేరాడు. దీంతో ఈ ఘటన కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అయితే మానవ తప్పిదం వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని విద్యుత్ సంస్థ తెలపడం గమనార్హం. ఈ క్రమంలోనే కల్పించుకున్న విద్యుత్ అధికారులు ఇక అసలు బిల్లు 13 వందల రూపాయలు ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు విద్యుత్ బిల్లు భారీగా వచ్చేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఇక ఉన్నతాధికారులు తెలిపారు. ఏదేమైనా ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: