సాధారణం గా డబ్బున్న వాళ్లు  ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే కార్పోరేట్ ఆసుపత్రిలలో చూపించుకుంటున్నారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రు లలో వేసే బిల్ కట్టలేక  ప్రభుత్వ ఆస్పత్రిలనే ఆశ్రయిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలం లో అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యులు నాణ్యమైన  వైద్యం అందిస్తున్నారు. కానీ కొంత మంది వైద్యులు మాత్రం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూనే మరో వైపు ప్రజల ప్రాణాలను ప్రమాదం లో పడేస్తున్నారు.


 ఇక్కడ వైద్యుల నిర్వాకం కాస్త ఏకంగా ఒక మహిళ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయ్. ఓ మహిళ కడుపు లో కత్తెర మర్చిపోకు కుట్లు వేసిన ఘటన  తిరుత్తని యూనియన్స్ వి కె ఆర్ పురం కాలనీలో వెలుగు లోకి వచ్చింది. అదే ప్రాంతం   లో బాలాజీ- కుపేంద్రి భార్య భర్తలు ఉన్నారు.  అయితే  కుపేంద్రిని 2013లో ప్రసవం కోసం తిరుత్తని ప్రభుత్వ ఆస్పత్రి లో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఈ క్రమం లోనే వైద్యులు ఆమె కడుపు లో పొరపాటున కత్తెర అలాగే ఉంచి కుట్లు వేశారు.


 అయితే ఆ విషయం పన్నెండేళ్ల వరకు బయట పడలేదు. కుపేంద్రినికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళి పరీక్షలు చేసి కడుపు లో కత్తెర  ఉంది అని వైద్యులు గుర్తించారు. ఇక 12 ఏళ్ల నుంచి కడప లో కత్తెర ఉందని తెల్సి  వైద్యులు సైతం అవాక్కయ్యారు. ఆపరేషన్ చేసి కత్తెర ఆమె కడుపులో నుంచి తొలగించారు. అయితే వైద్యుల నిర్వాకంపై బాధితురాలి భర్త మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసాడు. కాగా 10 లక్షల పరిహారం ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: