ఇటీవలికాలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులందరికీ బెంబేలెత్తిస్తున్నాయి. ఎందుకంటే తొలకరి చినుకు పడిన సమయంలో ఎంతో సంతోష పడి పోయిన రైతు దుక్కి దున్ని పంట వేసేశాడు. ఇక ఇప్పుడు వర్షాలు తగ్గకపోవడంతో వేసిన పంట మొత్తం నీట మునిగి పోతుంది. ఈ క్రమంలోనే ఈ వాన దేవుడు మా మీద పగ బట్టినట్లున్నాడు అంటూ బాధపడుతూ ఎంతో మంది రైతులు అయోమయంలో పడిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా వస్తున్న వరదలతో పంటను  ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు మొత్తం దిగాలుగా కూర్చున్న పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.


 ఇక మరోవైపు వైపు ఎంతగానో పెట్టుబడి పెట్టి పంట వేసిన పంట చివరికి నీటమునిగి పోవడంతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది.. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది అని తెలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగిపోవడంతో మనస్థాపానికి గురైన తల్లి కొడుకు చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. గుడి హత్నూర మండలం రాంపూర్ లో కౌలు రైతు రాధ, దేవయ్య  దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.


 వీరికి 23 ఏళ్ల కుమారుడు హరీష్ ఉన్నాడు. అతను కూడా ఒక వైపు వ్యవసాయ పనులు చేసుకుంటూనే మరోవైపు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉంటాడు. కాగా దేవయ్య ఈ ఏడాది 7 ఎకరాల్లో పత్తి పంటను వేయడంతోపాటు సోయా సాగు చేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నీట మునిగి పోయింది.  దీంతో ఆందోళన లో మునిగి పోయిన దేవయ్య పంటను కాపాడుకోవడం ఎలా అనే బాధతో చివరికి అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే అతని ఆసుపత్రిలో చేర్పించగా భారీగానే ఖర్చు అయ్యాయి. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై కుటుంబంలో గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో తల్లి రాధ కొడుకు హరీష్  పురుగుల మందు తాగారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: