సాధారణంగా ఎవరైనా వ్యక్తులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఇక మళ్లీ ఇంటికి తిరుగు ప్రయాణం కావడానికి బస్సులోనో లేకపోతే ఆటోలోనే వెళ్తారు. ఒకవేళ జేబులో డబ్బులు లేవు అంటే ఇక రోడ్డుపై వెళ్తున్న వారిని ఎవరినో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ఇంటికి వెళ్లడానికి చేసే పని ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్ అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటికి వెళ్లాలని భావించిన ఒక వ్యక్తి ఏకంగా ఒక బస్సును దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

 పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన స్టూడెంట్స్ బస్సు సోమవారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయింది. అయితే విద్యార్థులను దింపి వేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఎదురుగానే బస్సును పార్క్ చేసినట్లు డ్రైవర్ చెబుతున్నాడు.. దీంతో అంత పెద్ద బస్సు ఏమై ఉంటుందా అని అందరూ వెతకడం ప్రారంభించారు. చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే కొన్ని గంటల తర్వాత రేగిడి ఆమదాలవలస మండలం మీసాల డోల పేట సమీపంలో ఇక బస్సు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.  ఈ క్రమంలోనే వేలిముద్రలు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.


 ఇక పోలీసు విచారణలో భాగంగా బయటపడిన నిజం తెలిసి పోలీసులు సైతం అవాక్కయ్యారు అనే చెప్పాలి. గోకర్ణ పల్లికి చెందిన సురేష్ అనే వ్యక్తి మద్యం తాగి.. అదే మత్తు లో  ఇక ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కనే ఆగివున్న బస్సును తీసుకు వెళ్ళాడు అన్న విషయం తేలింది. పోలీసులు సురేష్ ని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు. అయితే సురేష్ చెప్పిన విషయం తో పోలీసులు సైతం అవాక్కయ్యారు అని చెప్పాలి. అయితే సోమవారం రాత్రి బస్సు తీసుకుని వంగర చేరుకుని తిరిగి ఇంటికి వెళ్లడానికి అదే వాహనాన్ని తీసుకు వెళ్లినట్లు సురేష్ పోలీసులకు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: