ఏం చెప్పను ఎలా చెప్పను నేటి రోజుల్లో భార్య భర్తల బంధం మధ్య తలెత్తిన కలహాలు చూస్తూ ఉంటే మాటలే రావడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది. భార్య భర్తలను చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇంత ఆనందంగా ఉండొచ్చ అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉండేది. కానీ అదంతా ఒకప్పటి మాట ఇప్పుడు చూస్తే మాత్రం భార్య భర్తల బంధం లో తలెత్తుతున్న గొడవలు మనస్పర్థలు చివరికి వీటి కారణంగా జరుగుతున్న దారుణ ఘటనలు చూసిన తర్వాత వామ్మో పెళ్లి చేసుకోవడం అంటే ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవడం ఏమో అని ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు అని చెప్పాలి..


 ఎందుకంటే కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా నిలవాల్సిన భార్య భర్తలు ఏకంగా బద్ధ శత్రువులుగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇలాంటి దారుణం ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య భర్త మీద పెట్రోల్ పోసి తగలబెట్టింది. చేజేతులారా పసుపు కుంకాలు తెంపుకుంది. ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చివరికి చికిత్స తీసుకుంటూ మరణించాడు. కోసి కలాన్ పట్టణంలో వెలుగు చూసింది ఈ ఘటన.


 రేఖ అనే మహిళకు చమన్ ప్రకాష్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. ఇటీవలే వేరే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదే విషయంపై భర్త  ప్రకాష్ కి అనుమానం వచ్చింది. దీంతో ఇటీవలే భార్యను అక్రమ సంబంధం పై నిలదీశాడు భర్త. కాగా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక ఇటీవలే చమన్ ప్రకాష్  నిద్రలో ఉన్న సమయంలో రేఖా అతని పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు వచ్చి మంటలను ఆర్పి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చివరికి 80 శాతంగా కాలిన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: