ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద కాస్త ఎక్కువ గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది అంటే చాలు ఇక రాత్రి పక్కా ప్లాన్ ప్రకారమే ఇంట్లోకి ప్రవేశించి తెల్లారే సరికి ఇంటిని గుల్ల చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుని బోతున్నారు.  అయితే ఇలా చోరీలకు  పాల్పడుతున్న ముఠాలను ఎన్నిసార్లు పోలీసులు అరెస్టు చేసినా కొత్త ముఠాలు  పుట్టుకు వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఇటీవలి కాలంలో దొంగతనాలు చేయడానికి ఎంతో మంది దోపిడి దొంగలు ఎంచుకుంటున్న దారులు పోలీసులకు షాక్ ఇస్తున్నాయి.


 ముందుగా ఎక్కడ దొంగతనం చేయాలి అనే విషయాన్ని తెలుసుకునేందుకు.. ఏదో ఒక వస్తువు అమ్మే వ్యక్తి లాగా ఇక అన్నీ కాలనీలు తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని ఇళ్లను సెలెక్ట్ చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడుతున్నారు. అంతే కాదండోయ్ పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక కుండా  ముందుజాగ్రత్త కూడా పడుతూ ఉన్నారు. దీంతో ఇలా చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకుని పోలీసులకు సవాల్గా మారి పోతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.


 ఇటీవల గుంటూరు లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.. ఇక వారిని విచారించగా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. పగలు పొట్ట తిప్పల కోసం దుప్పట్లు అమ్మే వ్యక్తులుగా ప్రతి గల్లి తిరుగుతూ ఉంటారట. ఈ క్రమం లోనే ఇలా తిరుగుతున్న సమయం లో చోరీ చేయాలి అనుకునే ఇళ్లకు ఎంచుకున్నారట. ఇక ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని విషయం పోలీసుల విచారణ లో వెల్లడైంది. ఇప్పటి వరకు మొత్తం ఐదు కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: