అర్ధరాత్రి ప్రయాణాలు చేస్తున్న సమయంలో అందరి కళ్ళన్ని కూడా రోడ్డుపక్కనే ఉంటాయి. ఎందుకంటే దయ్యాలు భూతాలు ఉన్నాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఈ అడవి ప్రాంతంలో ప్రయాణాలు చేస్తూ ఉంటే ఇక ఏదైనా అడవి జంతువులు రోడ్డుమీదికి వస్తాయేమో అని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉంటారు మరికొంతమంది. ఇలా ఎవరైనా సరే అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డుపై ప్రయాణం చేస్తున్నారు అంటే తప్పకుండా వారి కళ్ళు అన్నీ కూడా రోడ్డుపక్కనే ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే   అయితే ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు కొంతమందికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.


 అర్ధరాత్రి దాటి పోయింది. బస్సు గమ్యస్థానానికి చేరుకునే క్రమంలో వేగంగా వెళుతుంది. కాగా ఒక మూల మలుపు దగ్గర దూరం నుంచి బస్సు లైట్ వెలుతురులో ఒక నల్లటి ఆకారం కనిపించింది. బస్సు డ్రైవర్ ను చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. ఏమై వుంటుందా అని బస్సును ఆపి చెక్ చేయడానికి వెళ్ళాడు. దీంతో అక్కడ ఉన్నది చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇక అక్కడ నల్లటి ఆకారం లో ఉంది ఏకంగా ఒక మహిళ మృతదేహం. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని రేవారి జిల్లా పరిధిలో వెలుగు చూసింది. ఢిల్లీ- జైపూర్ హైవే పై ఓ ప్రైవేట్ బస్సు అర్ధరాత్రి వెళుతుంది.


 అలవాల్ పూర్ గ్రామ పరిధిలోకి రాగానే బస్సు నడుపుతున్న డ్రైవర్ కు ఇక బస్సు లైట్ వెలుతురులో ఏదో నల్లటి ఆకారం కనిపించింది. అనుమానం వచ్చిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సు ఆపి అక్కడికి వెళ్లి ఏంటా అని చెక్ చేసి చూశాడు. అక్కడ ఒక మహిళ మృతదేహం పడి ఉంది. దీంతో బస్సు డ్రైవర్ మాత్రమే కాదు.. ఆ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా అవాక్కయ్యారు. ఇక ఆ మృత దేహానికి పూర్తిగా గాయాలు.. మెడ చుట్టూ చున్నీ ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: