ఇటీవలి కాలంలో జరుగుతున్న నేరాలను ఛేదించడం పోలీసులు పెద్ద సవాలుగానే మారిపోతుంది అని చెప్పాలి. ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఎంతో చాకచక్యంగా నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. పోలీసులు కూడా చిన్న క్లూ పట్టుకొని కూపీ లాగితే డొంక కదిలింది అన్న చందంగా విచారణ సాగిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. హర్యానాలోని అల్వార్ కు చెందిన మెటల్ వ్యాపారి మంగల్ ఆరోరా మిస్సింగ్ కేసును ఇటీవలే పోలీసులు ఛేదించారు. అయితే మంగల్ ఆరోరా ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు తన దగ్గర అప్పు తీసుకున్న  అంకిత్ అనే విషయాన్ని నిర్ధారించారు పోలీసులు. అంకిత్  తో పాటు ఇతర సహచరులతో కలిసి మంగల్ ఆరోరా ని దారుణంగా హత్య చేయడమే కాకుండా తన గోడౌన్ లో గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.


 అయితే మృతదేహాన్ని పాతి పెట్టడమే కాదు ఈ విషయాన్ని ఎవరికీ చెప్ప కుండా ఉండేందుకు తన ఇద్దరు సహచరులకు కూడా ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున అంకిత్ ఇచ్చాడు అన్న విషయం కూడా పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే మంగల్ ఆరోరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు చివరికి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇంతకీ ఈ హత్యకు కారణం ఏంటి అంటే.. రేవారికి చెందిన  అంకిత్  తీసుకున్న డబ్బులు తిరిగి వస్తానని ఒక ప్లేస్ కి రావాలి అంటూ మంగల్ ఆరోరా కి చెప్పాడు. ఇక మంగల్ ఆరోరా ఢిల్లీ రోడ్డు లోని ఉత్తమ్ నగర్ లో ఉన్న గోడౌన్ కు చేరుకున్నాడు.


 ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం సహచరులతో మంగల్ ఆరోరాను దారుణంగా చంపేసి అక్కడే పాతిపెట్టారు.తన దగ్గర 10 లక్షలు తీసుకొని మంగల్ ఆరోరా వెళ్లిపోయాడు అంకిత్  పోలీసులకు సమాచారం అందించాడు. కానీ పోలీసు విచారణలో మాత్రం అంకిత్ మంగల్ ఆరోరాకు 35 లక్షలుఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఇలా హత్య చేసినట్లు తేలింది. అయితే ఐదు రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకోవడం పై ఉన్నతాధికారులు పోలీసులను అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: