సాధారణంగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అని చెబుతూ ఉంటారు.. ఎందుకంటే నమ్మకంగా ఉన్న వ్యక్తి దొంగతనం ఎలా చేస్తాడు అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కానీ చాలా నమ్మకంగా ఉన్న వారే చివరికి వెన్నుపోటు పొడుస్తారు అన్నది మాత్రం ఆ తర్వాత అర్థమవుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంతో మంది దొంగలు ఇలాంటి స్టయిల్ లోనే దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పటిలా సీక్రెట్ గా ఇంట్లోకి ప్రవేశించి నగలు విలువైన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో అని వెతకడం కాదు.. పని మనుషులుగా ఇంట్లో చేరి కొన్నాళ్ళపాటు ఎంతో నమ్మకంగా పని చేస్తూ ఉన్నారు.


 ఆతర్వాత సమయం సందర్భం చూసి అన్ని విలువైన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని  యజమానులకు షాక్ ఇస్తున్నారు. ఇక మరికొంత మంది ఇళ్లల్లో చొరకి పాల్పడితే ఏమొస్తుంది బ్యాంకులు లూటి చేస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటున్నారో ఏమో చివరికి బ్యాంకులనే టార్గెట్ గా చేసుకుంటూ చోరీలు చేస్తున్నారు.. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. గోల్డ్ ఫైనాన్స్ సంస్థ లో భారీ దోపిడీ జరిగింది. ఏకంగా 15 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు దొంగలు. కానీ పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో ఈ కేసులో ఊహించని మలుపు తిరిగింది.


 దొంగతనం చేసింది ఎవరో కాదు ఏకంగా దొంగలను పట్టుకోవాల్సిన పోలీస్ అధికారే అన్న విషయం తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. చెన్నైలో ఈ ఘటన వెలుగు చూసింది. గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. పట్టపగలే దొంగలు సిబ్బందిని బెదిరించి 15 కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేస్తుండగా 3.7 కేజీల బంగారు నగలను ఇన్స్పెక్టర్ అమలరాజు ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలకు సహకరించినందుకు గాను అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. అయితే  పోలిసే ఇలాంటి నీచమైన పని చేయడంతో ప్రతి ఒక్కరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: