ఒకప్పటి చదువులకు నేటి రోజుల్లో చదువులకూ ఎంతో తేడా ఉంది అని చెప్పాలి. ఒకప్పుడు ఎంతో ఇష్టంగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకునే వారు ఇప్పుడు మాత్రం ఎంతో కష్టంగా చదువుతూ మార్కులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఎక్కువ మార్కులు సాధించాలి.. టాప్ ర్యాంకు లో  పేరు కనిపించాలనే మాయలో మునిగిపోతున్న ఎంతోమంది.. చివరికి సబ్జెక్టు రాకున్నా పర్వాలేదు కానీ బట్టీపట్టి చదివి మార్కులు తెచ్చుకోవడం కోసం తెగ ఆరాటపడిపోతుంటారు. అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ప్రతి ఒక్కరికి నేటి రోజుల్లో చదువులు ఒక పెద్ద ఒత్తిడి గా మారిపోయాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.


 సాధారణంగా స్కూలుకు వెళ్లిన సమయంలో టీచర్లు హోంవర్క్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఒక వైపు స్కూల్ లోనే కాదు ఇంటి దగ్గర కూడా విద్యార్థులు చదువుతూనే ఉండాలని అలా అయితేనే వారికి ఏకాగ్రత ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్నిసార్లు మాత్రం అటు టీచర్లు ఇచ్చే హోం వర్క్ లు  విద్యార్థులను తీవ్ర ఒత్తిడిలో నెడుతూ ఉంటాయి. హోం వర్క్ చేయకపోతే టీచర్ ఏమంటుందో అని విద్యార్థులు అందరూ కూడా భయపడిపోతుంటారు. ఇక్కడ ఓ విద్యార్థి ఇలాంటి ఒత్తిడికి గురయ్యాడు. హోంవర్క్ చేయకపోతే ఏం జరుగుతుందో అని భయపడి చివరికి తన ప్రాణాలను బలవంతంగా తీసుకున్నాడు.


 ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో సజీవదహనం అయ్యాడు అని చెప్పాలి. కొడుకు చేసిన పనితో తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలింది అనే చెప్పాలి. ఈ విషాదకర ఘటన తమిళనాడు తిరువారూరు జిల్లా పేరాలంలో వెలుగులోకి వచ్చింది. తనకు క్లాసులు అర్థం కావడం లేదని హోంవర్క్ సరిగా చేయలేక పోతున్నాను అంటూ తల్లిదండ్రులకు చెప్పాడు ఆ విద్యార్థి. వేరే స్కూల్లో జాయిన్ చేయాలి అంటూ కోరాడు. కానీ తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: