ఇటీవలి కాలంలో చదువు అనేది ఒక పెద్ద బిజినెస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే . అటు ప్రభుత్వ పాఠశాలలో నిజంగానే విద్యాబోధన జరుగుతున్నప్పటికీ అరకొర వసతులు ఉన్న కారణంగా ఇక తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించడానికి నేటి రోజుల్లో తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఇక ఎంత పిండుకోవాలో అంత పిండుకుంటున్నాయి  ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. సామాన్య ప్రజలకు జేబులు గుల్ల చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫీజుల విషయంలో కనీసం జాలి దయ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాయి.


 ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏకంగా విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో దారుణంగా వ్యవహరించిన ఘటనలు  ఇప్పటివరకు ఎన్నో వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి.  ఇక్కడ ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం చేసిన పని కాస్త ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది అని చెప్పాలి. ఫీజు కట్టలేదు అనే కారణంతో దాదాపు 34 మంది విద్యార్థులను ఐదు గంటలపాటు స్కూల్ లోనే ఒక గదిలో నిర్బంధించింది పాఠశాల యాజమాన్యం. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది అని చెప్పాలి.

 ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. భువనేశ్వర్లోని ప్రైవేట్ పాఠశాలలో వివిధ తరగతులకు చెందిన 34 మంది విద్యార్థులు ఫీజు కట్టలేదు. వారందరిని లైబ్రరీ లోకి పిలిపించి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కూడా నిర్బంధించారు. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ ఎదుట నిరసనకు దిగారు. స్కూల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: