ఒకప్పుడు సమాజంలో వివక్ష కొనసాగుతూ ఉండేది. దళిత వర్గాలకు చెందిన వారు ఉన్నత వర్గాలకు చెందిన వారు అని మనుషులను రెండు వర్గాలుగా విభజిస్తా ఉండేవారు. దళిత వర్గాలకు చెందిన వారు దేనిని ముట్టుకోకూడదు అని  ఒక కండిషన్ కూడా పెట్టేవారు. ఇలాంటిది కొంతమంది నేరుగా చూడకపోయినా  సినిమాల్లో చూసే ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇలాంటివి ఎక్కడ కొనసాగడం లేదు.  ఎందుకంటే మనుషులంతా ఒక్కటే అని ధోరణితోనే ప్రస్తుతం అందరూ కలసి మెలిసి ఉంటున్నారు.  కులాలు మతాలకు దాదాపుగా అందరూ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.


 కానీ ఇప్పటికి  దళితులు గిరిజనులు తీవ్ర స్థాయిలో వివక్షకు గురవుతున్నారు అనే విషయం మాత్రం ఇప్పటికి కూడా కొన్ని ఘటనల ఆధారంగా తెలుస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న  ఒక స్కూల్లో దళిత విద్యార్థి నీరు తాగడానికి కుండను  ముట్టుకున్నాడు అనే కారణంతో టీచర్ ని చితకబాదిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.  ఇప్పుడు మరోసారి విద్యార్థి పట్ల మరో ఉపాధ్యాయుడు ఇలాగే వ్యవహరించాడు. కులం మతం అనేది ఏదీ లేదని అసలు వివక్ష తో ఎవరిని చూడకూడదని విద్యార్థులకు మంచి మాటలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఇటీవలే ఒక విద్యార్థి పట్ల  దారుణంగా వ్యవహరించారు.


 తన బైక్ ని తాకాడు అన్న కారణంతో దళిత విద్యార్థి పై దాడికి పాల్పడ్డాడు ఉపాధ్యాయుడు.  విద్యార్థిని క్లాస్ రూమ్ లో బంధించి ఇనుపరాడ్ చీపురుతో దారుణంగా కొట్టాడు.  అంతే కాకుండా గట్టిగా గొంతు కూడా పిసికాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రానౌపూర్ లో వెలుగులోకి వచ్చింది.  హయ్యర్ సెకండరీ స్కూల్ లో జరిగింది ఈ ఘటన.  అయితే అక్కడే ఉన్న సిబ్బంది ఇక విద్యార్థిని ఆ ఉపాధ్యాయుడు బారి  నుంచి కాపాడారు.  ఆగ్రహించిన కుటుంబ సభ్యులు స్కూల్ వద్ద ఆందోళన చేయడంతో సదరు ఉపాధ్యాయుడుని  సస్పెండ్ చేశారు స్కూల్ యాజమాన్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: