ఈ భూమిమీద బ్రతికే ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇది ఎంతో మంది విషయంలో నిజం అవుతూ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కొంతమంది చేసిన తప్పులకు కొన్ని సంవత్సరాల తర్వాత ఫలితం అనుభవిస్తే మరికొంతమంది మాత్రం ఇన్స్టెంట్  కర్మ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా తప్పు చేయాలి అనుకున్న వారు తప్పు చేసిన రోజుల వ్యవధిలో గంటల వ్యవధిలో లేదా నిమిషాల వ్యవధిలోనే కర్మ ఫలితం అనుభవించి ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు తెరమీదికి వస్తూ ఉంటాయి.


 ఇటీవలే  కాలంలో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కర్మ ఫలితం అనుభవించక తప్పదు అని మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల రహస్య వీడియోలు తీసి ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదికి దూకేందుకు ప్రయత్నించిన యువకుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్ లో వెలుగుచూసింది ఈ ఘటన. దిలీప్ అనే 24 ఏళ్ల యువకుడు గౌతమ్ నగర్ లో ఉన్న సాయి తేజ స్నేహితులు.


 ఇకపోతే ఇటీవల సాయితేజ ఉంటున్న ఫ్లాట్ కి వచ్చాడు దిలీప్. ఇద్దరూ కలిసి ఫుల్లుగా మద్యం తాగారు. ఇక సాయి తేజ నిద్రిస్తున్న సమయంలో దిలీప్ సిగరెట్ తాగెందుకు  పైకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే కిటికీలోనుంచి చూస్తే ఇద్దరు అమ్మాయిలు కనిపించారు. వారిని రహస్యంగా వీడియో తీసేందుకు ప్రయత్నించి చివరికి దొరికిపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని పట్టుకునేందుకు వచ్చిన వారి దగ్గర నుంచి తప్పించుకునేందుకు ఒక భవనం పై నుంచి మరో భవనం పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: