ఇటీవల కాలంలో ప్రతి మనిషి కూడా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నాడు. కొంత మంది పరీక్షల్లో మార్కుల కోసం.. మరికొంత మంది వ్యాపారంలో లాభాల కోసం.. ఇంకొంతమంది  మంచి ఉద్యోగం కోసం.. ఇలా వివిధ కారణాలతో ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడితో కూడిన జీవితం లోనే బతుకుతున్నారు అని చెప్పలి. ఈ క్రమంలోనే ఈ ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరికి  మనశ్శాంతి కరువవుతుంది అని చెప్పాలి. తద్వారా కనీసం కంటిమీద కునుకు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. నిద్రపోవడానికి బెడ్ మీదకు చేరుకున్న కాసేపైనా నిద్ర పడుతుందేమో అని నిరీక్షణ చూడాల్సిన పరిస్థితి.


 ఇలా ఒత్తిడి కారణంగా నిద్ర రాకపోవడంతో కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే నేటి రోజుల్లో ఒత్తిడితో కూడిన జీవితంలో ఎంతో మంది చిన్న చిన్న కారణాలతో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవలే  ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  నిద్ర రావడం లేదు అనే కారణంతో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కూతురే ప్రాణంగా బతికిన తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది.


 ఒడిశాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశాలో భువనేశ్వర్ లో నర్సింగ్ చదువుతున్న ఒక అమ్మాయి ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది.  ఈ క్రమంలోనే  ప్రతి రోజు నిద్ర పోవడానికి ఎంతో బాధ పడాల్సి వస్తుందని మనస్తాపం చెందింది. కాగా క్షణికావేశంలో నిర్ణయం తీసుకని చనిపోయింది. నిద్ర రాకపోవడంతో రాత్రి హాస్టల్ మొత్తం  తిరుగుతూ ఉండేది. దీంతో ఎంతో మంది చెడుగా మాట్లాడుకోవడం తో ఇక ఇలాంటి పని చేసింది అన్న విషయం పోలీసుల విచారణలో తేలింది. నిద్ర సమస్య కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో కూడా రాసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: