ఒకప్పటి విద్యకు నేటి రోజుల్లో కార్పొరేట్ విద్య కు ఎంతో తేడా ఉంది అని చెప్పాలి. నేటి రోజుల్లో మార్కులు ర్యాంకులు వెంటపడుతున్న విద్యాసంస్థలు ఇక విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక విద్యార్థులు చేయలేనంత హోంవర్క్ ఇవ్వడం ఒకవేళ హోంవర్క్ చేయకపోతే విద్యార్థులకు తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. తద్వారా తమ పిల్లలు బాగా చదువుకుంటారు అని తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూలుకి  పంపిస్తే పిల్లలు ఒత్తిడికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది.


 టీచర్ల వ్యవహార శైలి కారణంగా రోజురోజుకీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా హోంవర్క్ చేయకపోతే టీచర్ విద్యార్థులను మందలించడం లాంటివి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం ఇలా జరిగితే ఊరుకోము అంటూ వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకసారి మిస్ అయినా మరోసారి విద్యార్థులు హోం వర్క్ చేయడం లాంటివి చేస్తారు. కానీ ఇక్కడ టీచర్ మాత్రం విచక్షణ కోల్పోయి విద్యార్థుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించింది.



 హోం వర్క్ చేయలేదు అన్న కారణంతో రెండో తరగతి చిన్నారికి దారుణమైన పనిష్మెంట్ ఇచ్చింది టీచర్. నిజాంబాద్ లోని వుడ్ బ్రిడ్జ్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. హోంవర్క్ చేయలేదని టీచర్ కోప్పడింది. బ్యాగ్ లో పుస్తకాలు నింపి బాలిక మెడపై వేసి మోయించింది. స్కేల్ తో దారుణంగా కొట్టింది. దీంతో గాయపడిన ఫాతిమా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తలలో రక్తం గడ్డకట్టడం కారణంగా చిన్నారి చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే స్కూల్ ముయించాలి అంటూ డీఈవో ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: