ఇటీవలి కాలం లో ఎక్కడ చూసిన దొంగల బెడద కాస్త ఎక్కువ గానే కనిపిస్తోంది. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది అంటే చాలు ఎలాగోలా లోపలికి ప్రవేశించి అందినకాడికి దోచుకు పోతున్నారు దొంగలు. ఇక మరి కొంత మంది దొంగలు ఇక ఎన్నో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ కేవలం తమకు కావాల్సింది మాత్రమే దొంగతనం చేస్తూ ఉండటం గమనార్హం. హర్యానా లోని గురుగ్రాం జిల్లాలో కూడా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది అని చెప్పాలి. బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ రూటల్ ఎత్తుకెళ్లి  బ్యాంకు సేవలను పూర్తిగా దెబ్బ తీశాడు.


 ఈ క్రమం లోనే సీసీటీవీ కెమెరాలో బ్యాంక్ డిజిటల్ వీడియో రికార్డర్ గా భావించి చివరికి రూటర్ ని ఎత్తుకెళ్లాడు దొంగ. నర్సింగాపూర్ బ్రాంచ్ లోని ఎస్బిఐ బ్యాంకు లో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో బ్యాంకులోకి ప్రవేశించాడు దొంగ. బ్యాంకులో నగదు కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది అని చెప్పాలి. దీంతో ఎంతో కష్టపడి లోపలికి వచ్చాను.. దొరికిన ఏదో ఒక వస్తువు తీసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాడు. ఇంటర్నెట్ సేవలు అందించే రూటర్ తీసుకుని పారిపోయాడు.



 ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావడం గమనార్హం. అయితే తర్వాత మర్నాడు యధావిధిగా డ్యూటీ కి వచ్చిన బ్యాంకు సిబ్బంది బ్యాంకు లో దొంగలు పడ్డారు అనే విషయాన్ని గుర్తించారు. లాకర్ పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు ఒక నిర్ణయానికి వచ్చారు.  బ్యాంకుకు చెందిన కొన్ని తాళాలతో పాటు  రూటర్ ని కూడా ఎత్తుకు వెళ్ళినట్లు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: