ఇటీవలి పోలీసులు చేయాల్సిన సగం పని అటు సీసీ కెమెరాలు చేసేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎక్కడైనా నేరం జరిగింది అంతే చాలు ఇక అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు.. నేరాలకు పాల్పడిన ఎవరు.. ఎంతమంది నేరం చేశారు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా పోలీసులకు అర్థమయ్యేలా చేస్తున్నాయి సీసీ కెమెరాలు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో సీసీ కెమెరాల కారణంగా అటు నేరాలను అరికట్టడానికి అంతేకాదు నేరస్తులను కనిపెట్టడం పోలీసులకు ఎంతో సులభంగానే మారిపోయింది అని చెప్పాలి.


 ముఖ్యంగా ఇటీవలి కాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఎక్కడికక్కడ నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మొయినా బాద్ లో నివసించే ఒక వ్యక్తి ఇటీవల తన ఇంటికి తాళం వేసి పనిమీద కూకట్పల్లి వెళ్లారు. ముందు జాగ్రత్తగా లో భాగంగా తన ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మూడు వేల రూపాయల కెమెరాను హాల్లో కూడా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక దొంగ ఆ ఇంట్లోకి జొరబడ్డాడు. సీసీ కెమెరాలు సహా విలువైన వస్తువులు  ఎత్తుకెళ్లాడు.


 యజమాని చిన్న కెమెరాకు వైఫై కనెక్ట్ చేసి సెల్ ఫోన్ కి కనిపించేలా చూసుకున్నాడు.  అయితే కూకట్ పల్లిలో ఉన్నప్పుడు ఫోన్ చెక్ చేసుకోగా సీసీ కెమెరా ఫుటేజ్ కట్ అయినట్లు గ్రహించాడు. వెంటనే పక్కనే ఉండే సోదరుడికి సమాచారం అందించాడు. అతను వెళ్లి చూడగా తాళాలు పగులగొట్టి ఉండటం.. బీరువాలో ఉన్న  వస్తువులు కింద పడి ఉండటం చూసి ఇక దొంగలు షాక్ పడ్డారు  అని చరవాణిలో యజమానికి సమాచారం అందించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించగా హాల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఆధారంగా దొంగను 24 గంటల్లో పట్టుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: