ఇటీవల కాలం లో ఎంతో మంది ఎలాంటి సమస్యకైనా సరే ఆత్మహత్య ఒకటే పరిష్కారం అనుకుంటున్నారు అనే విషయం తెలిసిందే.  ఈ క్రమం లోనే చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు కరెంట్ పోల్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ యువకుడు తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు.


 కానీ అకస్మాత్తుగా పిల్లలు కనిపించకుండా పోవడం  తో ఒక్క  సారిగా కంగారు పడి పోయాడు. అన్నిచోట్లా గాలించినా చివరికి పిల్లల ఆచూకీ తెలియలేదు. భార్యకు  ఈ విషయం చెప్పి ఆవేదనకు గురి అయ్యాడు. తర్వాత ఓహెచ్ఈ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకో బోయాడు. తర్వాత విద్యుదాఘాతానికి గురై పడి పోయాడు. గమనించిన స్థానికులు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతనిని ఆసుపత్రికి తరలించారు.  ఈ విషాదకర ఘటన నెల్లూరు సమీపం  లోని బిట్రగుంట రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది అని చెప్పాలి.


 జార్ఖండ్కు చెందిన జత కండీర్ తన ఇద్దరు పిల్లలతో కలిసి కేరళ వెళ్లేందుకు టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కాడు.  అయితే విజయవాడకు చేరుకున్న సమయం లో తన ఇద్దరు పిల్లలు మాత్రం కనిపించలేదు. ట్రైన్ మొత్తం గాలించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎంతగానో మనస్తాపం చెందాడు. భార్యకు విషయం ఫోన్ చేసి చెప్పి చివరికి రైల్వే స్టేషన్ భవనం ఎదురుగా ఉన్న ఓహెచ్ఈ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ట్రాన్స్ఫార్మర్ కు కొద్ది దూరంలో ఉండగానే కరెంట్ షాక్ కి గురయ్యాడు. దీంతో స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇలా కనిపించకుండాపోయిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఒక ఆశ్రమంలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: