సినిమాల ప్రభావమొ.. ఇంకేదైనా ప్రభావమో తెలియదు కానీ ఇటీవల కాలం లో మనుషులు ఆలోచిస్తున్నా తీరు వినూత్నం గా విచిత్రం  గా ఉంటుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఈ క్రమం లోనే మనుషుల ఆలోచన తీరు ఏకంగా పోలీసులకు సైతం షాక్ ఇస్తోంది అనే చెప్పాలి. ముఖ్యం గా నేరాలకు పాల్పడుతున్న సమయం లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఎన్నో దారులను వెతు కుతున్నారు అక్ర మార్కులు. చివరికి పోలీసులకు పట్టుబడి కటకటాల పాలవుతున్నారు.


 ముఖ్యంగా నేటి రోజుల్లో గంజాయిని అక్రమం గా స్మగ్లింగ్ చేసే దాందా  ఎంత జోరుగా కొనసాగుతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ అటు అక్ర మార్కులు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. గంజాయి అక్రమ రవాణాకు కాదేది అనర్హం అన్న విధం గానే ప్రతి వస్తువును కూడా స్మగ్లింగ్  కోసం ఉపయోగించుకుంటూ ఉండడం గమనార్హం. మొన్నటికిమొన్న వెడ్డింగ్ కార్డు లో కొకైన్  లాంటి మాదక ద్రవ్యాలు బయటపడిన ఘటన సంచలనం గా మారి పోయింది.


 ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ఎల్పిజి సిలిండర్లలో గంజాయి దాచి అక్రమం గా తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.  పట్టుబడిన వారిలో ఒకరు ఆగ్రా చెందిన వ్యక్తి కాగా మరొకరు ఫారుఖా బాద్ కు చెందిన వాడు.  బైక్ పై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని మైయింపూరి పరిధి లోని  ప్రాంతం గుండా వెళ్తున్నాడు. అనుమానస్పదంగా కనిపించడం తో పోలీసులు తనిఖీ చేసారు. దీంతో వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు  నిందితులు. పరిశీలించగా సిలిండర్ కాస్త బరువు ఎక్కువగా ఉండడంతో గంజాయి నింపినట్లుగా చివరికి నిందితులు ఒప్పుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: