నేటి రోజుల్లో మాటమీద నిలబడేమనుషులు చాలాఅరుదుగా నూటికో కోటికో ఒక్కరు కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి   ఎన్నో రకాల ప్రమాణాలు చేసినప్పటికీ  సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రం మాటమీద నిలబడకుండా ఇచ్చిన మాటను తుంగలో తొక్కుతూ ఉండే మనుషులు నేటి సమాజంలో ఎక్కువగా ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా మాటమీద నిలబడే మనుషులు ఉన్నారు అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు అప్పుడప్పుడు తెరమీదికి వస్తూ ఉంటాయి అనే చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ఇప్పటివరకు ఎవరు కనీవినీ ఎరుగనిది.


 ఎన్నో ప్రమాణాలు చేసి సమయం వచ్చినప్పుడు వాటిని మరిచిపోతున్న మనుషులు కనిపిస్తున్న నేటి రోజుల్లో ప్రజల కోసం పోరాడి ఇక న్యాయం చేయకపోతే ప్రాణాలు వదులుతా అంటూ శపథం  చేసిన ఒక వ్యక్తి చివరికి తన పోరాటం ఫలించకపోవడంతో ఇచ్చిన మాట   ప్రకారం తన ప్రాణాన్ని వదలడానికి కూడా సిద్ధమైన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాను చిన్నప్పటి నుంచి నీళ్లు పోసి పెంచిన చెట్టుకే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు వ్యక్తి.


 ఈ ఘటన స్థానికులను కూడా అవాక్కయ్యేలా చేసింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ప్రముఖ పర్యావరణ వేత్త కర్ణాటకకు చెందిన సాలుమరద వీరాచారి ఇటీవలె ఆ నీరు పోసి పెంచిన చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే మిట్ల కట్టే గ్రామంలోని రేషన్ షాపులో అక్రమాలు జరుగుతున్నాయి అంటూ ఆయన ఆరోపించాడు. ఇది నిరూపించేందుకు సుమారు 20 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. నిత్యావసరాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూస్తానని లేదంటే ఉరివేసుకొని చస్తాను అంటూ శపథం చేశాడు. ఎంత పోరాడినా అన్యాయమే పైచేయి సాధించింది అని మనస్థాపంతో ఇచ్చిన మాట ప్రకారం ఉరివేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: