ఇటీవలికాలంలో చదువులు ఎంతో కమర్షియల్ గా మారిపోయాయి అనే విషయం తెలుస్తుంది. ఒకప్పటిలా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం లాంటివి ఎక్కడా కనిపించడం లేదు. ఒకప్పుడు స్కూల్కు వెళ్లే విద్యార్థులు చదువుకోవడం ఆడుకోవడం స్నేహితులతో సరదాగా గడపటం లాంటివి చేసేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం చదువులు ఎంతో ఒత్తిడితో కూడుకున్నవీగా మారిపోయాయి. స్కూల్ కి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలతోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 అయితే ఒకవైపు ప్రైవేట్ పాఠశాలలో కమర్షియల్ గా ఆలోచిస్తూ భారీగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే.. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంతే కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. బాగానే ఫీజు లు కడుతున్నాము కదా మంచి ర్యాంకులు రాకపోతే ఎలా అనే ఆలోచనతో ఇక తమ పిల్లలపై బాగా చదువుకోవాలని.. మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని  ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పాలి. తద్వారా నేటి రోజుల్లో పాఠశాల స్థాయి నుంచి కాలేజీ వరకు కూడా ప్రతి ఒక్క  విద్యార్థి ఒత్తిడిలోనే చదువులు కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 సాధారణంగా స్కూల్ కి వెళ్ళే పిల్లలు హోంవర్క్ చేయడానికి మారాం చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో బుజ్జగించడం లేదా తిట్టడం కొట్టడం చేసి హోం వర్క్ చేయించడం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు.  కానీ ఇక్కడ మాత్రం ఒక తండ్రి హోంవర్క్ చేయలేదని ఏకంగా కొడుకుపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన పాకిస్థాన్లో వెలుగులోకి వచ్చింది. ఆరంగి టౌన్ కు చెందిన నజీర్ తన పన్నెండేళ్లు కొడుకు షాహీర్ హోం వర్క్  చేయకుండా తరచు స్నేహితుల తో ఆడుకుంటున్నాను అని ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలపాలైన షాహిర్ చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: