ఇటీవల కాలంలో ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచిన నేపథ్యంలో సామాన్య ప్రజలందరూ కూడా ఎంతలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే కొంత మొత్తంలో విద్యుత్ ఉపయోగించినప్పటికీ కూడా చార్జీలు మాత్రం భారీగానే వస్తూ ఉన్న నేపథ్యంలో సామాన్య ప్రజలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం పెంచిన ఛార్జీలతో కామన్ మ్యాన్ ఇబ్బంది పడుతూ ఉంటే ఇక విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాన్యులకు ఊహించని షాకులు ఇస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కనీసం వేలల్లో కూడా రాని కరెంటు బిల్లును ఏకంగా లక్షల్లో వచ్చినట్లుగా రసీదులు అందించడం లాంటివి చేసి ఒక రకంగా సామాన్యుడి గుండె ఆగిపోయినంత పనిచేస్తున్నారు విద్యుత్ అధికారులు. ఇక ఇలా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా సామాన్యుడు నెలంతా విద్యుత్ వినియోగం చేస్తే ఎంత బిల్ వస్తుంది మహా అయితే 500 లేదా 1000 రూపాయల లోపు వస్తుంది.


 కానీ ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రం వచ్చిన ఒక నెల బిల్లు చూసి అతని గుండె ఆగిపోయినంత పని అయింది అని చెప్పాలి. ఎందుకంటే అతనికి వచ్చిన బిల్లు వందల్లో వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో రావడం గమనార్హం. ఒక నెల కరెంటు వినియోగానికి గాను 12.91 లక్షల కరెంటు బిల్లు వచ్చింది.  ఇది చూసి కామన్ మాన్ ఒక్క సారిగా షాక్ అయ్యాడు అని చెప్పాలి.  ఈ ఘటన పుదుచ్చేరిలో వెలుగులోకి వచ్చింది. అతను టీవీ మెకానిక్ గా పనిచేస్తూ ఉంటాడు.  అతని పేరు శరవణన్.  అయితే జూలై నెలలో కరెంటు బిల్లు లక్షల్లో రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇక ఆ తర్వాత మీటర్ రీడింగ్ చూసి తప్పుగా ఉంది అంటూ విద్యుత్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే ఇక ఇప్పటికి విద్యుత్ బిల్లులు సరి చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: