ఏంటో ఈ మధ్యకాలంలో మనుషులు మనుషుల్లా మాత్రం అసలు ప్రవర్తించడం లేదు. ఏకంగా మానవత్వం ఉన్న మనుషులు మానవ మృగాలుగా మారిపోతున్నారు. పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ళ విషయంలో కూడా కాస్తయినా జాలి దయ ఉన్నట్లుగా వ్యవహరించడం లేదు. వెరసి చాక్లెట్ తిన్నంత ఈజీగా ప్రాణాలను తీసేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా సొంత వారి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.


 ఇలా హత్యలకు సంబంధించిన ఘటనలు నేటి రోజుల్లో కోకోలలుగా వెలుగుచూస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. తన భార్య తనను మోసం చేసి వేరొకరితో సహజీవనం చేస్తుంది అంటూ అనుమానాన్ని పెంచుకున్నాడు భర్త.. చివరికి ఆడవారి గొప్పతనాన్ని చెప్పే బతుకమ్మ పండుగ రోజే దారుణంగా హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వీరాపూర్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు.  పెద్ద కుమార్తె మంగను స్థానికుడైన ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు.


 పెళ్ళైన నెల రోజులకె మంగ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఇప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో  మంగ చెల్లెలు స్వప్నను ఇచ్చి వివాహం చేసారు. ఇక వీరికి కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు. వీరి సంసారం ఎంతోగా సాఫీగా సాగిపోయేది. కానీ ఇటీవలే మనస్పర్ధలు మొదలయ్యాయి. స్వప్న అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తుంది అన్న విషయం తెలుసుకున్న భర్త ఎల్లారెడ్డి ఎన్నోసార్లు గొడవకు దిగి చంపేస్తానంటూ బెదిరించాడు. ఇటీవలే మహిళలు అందరూ కలిసి బతుకమ్మ ఆడుతున్న సమయంలో స్వప్న తలపై ఎల్లారెడ్డి ఇనుప రాడ్ తో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది స్వప్న. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: