తల్లిదండ్రులు అందరూ కూడా తమ కొడుకుని గొప్పవాడిని చేయాలని భావిస్తూ ఉంటారు . ఇక తల్లిదండ్రులు అనుకున్న విధంగానే కొడుకు బాగా చదివి మంచి ఉద్యోగం వచ్చి ప్రయోజకుడు అయ్యాడు అంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. ఇక్కడ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొడుకే ప్రాణంగా బ్రతికి అతని చదువుల కోసం ఎంతో కష్టపడి చివరికి అతనికి మంచి ఉద్యోగం వచ్చేలా చేశారు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడిపోయారు. కానీ వారి ఆనందం చూసి మాత్రం విధి ఓర్వలేకపోయింది. చివరికి ఆ తల్లిదండ్రుల ఆనందం మూడు నెలలు ముచ్చటగా మిగిలిపోయింది.


 తమ కొడుకుకు మంచి ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులు ఆనందపడుతున్న సమయంలో వారం రోజుల కిందట వారి కొడుకు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అతని శరీరం మాత్రం చికిత్సకు సహకరించలేదు. దీంతో అతనికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి సమయంలోనే తల్లిదండ్రులు ఒక గొప్ప ఆలోచన చేశారు. మీ కొడుకు చనిపోయినప్పటికీ మరో కొంతమందికి ప్రాణం పోస్తాడు. వారిలో బ్రతికే ఉంటాడు అని వైద్యులు అవయవ దానం గురించి చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే ఒప్పుకున్నారు.


 హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంఠాత్మకూరుకు చెందిన ప్రేమలత ఉమాచారిలకు ఇద్దరు మగసంతానం. పెద్ద కుమారుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు అభిషేక్ హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తిచేసి మూడు నెలల కిందటే హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇక ఇటీవల హైదరాబాద్ నుంచి స్వగ్రామం వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతని యశోద ఆసుపత్రిలో చేర్పించగా బ్రెయిన్ డెడ్ గా వైద్యుల నిర్ధారించారు. తల్లిదండ్రుల అంగీకారంతో చివరికి అభిషేక్ అవయవ దానం చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: