ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు తరచూ వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి   కోర్టులు అత్యాచార నిందితులకు కఠిన శిక్షులు విధిస్తున్నప్పటికీ కామాంధుల తీరు లో మాత్రం మార్పు రావడం లేదు  ఆడపిల్ల ఒంటరి గా కనిపించింది అంటే చాలు మగాడు మృగాడిగా మారి పోయి దారుణం గా అత్యాచారాలు చేస్తున్నాడు. కొంత మంది అయితే అత్యాచారాలతో ఆగకుండా ఏకంగా దారుణంగా హత్యలు చేస్తూ  ప్రాణాలు సైతం తీసేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయ్.


 వెరిసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న అత్యాచార ఘటనలు చూసిన తర్వాత ఇక ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయటపెట్టిన తర్వాత మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందో లేదో అని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రి అనుక్షణం భయపడుతున్న పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో అత్యాచారానికి అటు న్యాయస్థానాలు కూడా కఠిన శిక్షల విధిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించింది కోర్టు.


 రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన గుంట శ్రీనివాస్ అనే 50 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి 2015 డిసెంబర్ 7వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని రిమాండ్కు తరలించారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని పలు ఆధారాలను సేకరించి కోర్టులో హాజరు పరిచారు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉండగా ఇటీవల రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 25వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: