ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిలో కూడా మొబైల్ పిచ్చి అనేది పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా మనిషి మొబైల్ కి బానిసగా మారిపోవడం అనేది కేవలం ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా ఇదే తరహా ధోరణి కనిపిస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనిషి అవసరాలు తీర్చుకునేందుకు మొబైల్ ని కనిపెట్టారు. కానీ ఇప్పుడు ఆరంగులాల మొబైల్ ఏకంగా ఆరడుగుల మనిషిని శాసించే స్థాయికి ఎదిగిపోయింది అని చెప్పాలి.


 ఇక ఇటీవల కాలంలో పెరిగిపోతున్న టెక్నాలజీ అటు ప్రతి ఒక్కరిని మొబైల్ కి మరింత ఎక్కువగా బానిసలుగా మార్చేస్తుంది అని చెప్పాలి. బయట ప్రపంచంతో పనిలేదు. మొబైల్ చేతిలో ఉంటే సరిపోతుంది అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు ఇంకొంతమంది. ఇక ఖరీదైన మొబైల్ ఫోన్ కొనడానికి చేయకూడని పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకోవడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి  ఇక్కడ ఇలాంటిదే జరిగింది   పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అన్నట్లుగా ఇక మార్కెట్లో ఎన్ని మొబైల్స్ ఉన్న ఐఫోన్ కు ఉండే క్రేజ్ మాత్రం ప్రత్యేకం.


 ఐఫోన్ తమ దగ్గర ఉంది అంటే చాలు ఒక స్పెషల్ స్టేటస్ తమ దగ్గర ఉంది అన్నట్లుగా భావిస్తూ ఉంటారు అందరూ. అందుకే కాస్త ధర ఎక్కువైనా ఐఫోన్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఐఫోన్ పై ఒక కుర్రాడికి ఉన్న మోజు చివరికి ప్రాణాలు తీసింది. ఢిల్లీకి చెందిన 12వ తరగతి చదువుతున్న అబ్దుల్లా ఐఫోన్ కొనేందుకు ఖలీద్ దగ్గర 72,000 అప్పు చేసాడు. చివరికి అప్పు చెల్లించే మార్గం లేకుండా పోయింది. ఖలీద్ పలుమార్లు అడిగిన అబ్దుల్లా పట్టించుకోలేదు. దీంతో సదరు బాలుడిని పిస్తల్ తో కాల్చి చంపాడు. ఇక పోలీసు విచారణలో ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: